90ల్లో ఓ వెలుగు వెలిగిన కథానాయిక గౌతమి. తెలుగమ్మాయే అయినా తమిళ, మలయాళ చిత్రాల్లో ఎక్కువగా మెరిసింది. చిలక్కొట్టుడు తరవాత మరో తెలుగు సినిమా చేయలేదు. దాదాపు 20 యేళ్ల విరామం తరవాత తెలుగులో నటిస్తోంది. అదే… మనమంతా. ఇక నుంచి రెగ్యులర్ గా సినిమాలకు టచ్ లో ఉంటానంటోంది గౌతమి. అంతేకాదు… భవిష్యత్తులో దర్శకత్వం వహించే అవకాశాలూ ఉన్నాయట. ”సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఈ వయసులోనూ ఎంజాయ్ చేస్తూ పనిచేయగలననే అనుకొంటున్నా. నాకు తగిన పాత్రలొస్తే తప్పకుండా నటిస్తా” అంటోంది.
దర్శకత్వం చేయాలని ఉందా? అని అడిగితే ”ఆ ఆలోచన ఉంది. అయితే అది చాలా పెద్ద ప్రోసెస్. కథ సిద్దం చేసుకోవడం దగ్గర్నుంచి….అన్ని విషయాలూ నా అధీనంలోనే జరగాలి. అలా చేయాలంటే టైమ్ తీసుకోవాలి. వరుసగా కొన్నాళ్లు నటిగా కొనసాగుదామనుకొంటున్నా. ఆ తరవాతే… దర్శకత్వం గురించి ఆలోచిస్తా” అంటోంది. కుమార్తె సుబ్బులక్ష్మికి కూడా సినిమాలంటే చాలా ఇష్టమట. తాను ఫిల్మ్మేకింగ్ కోర్స్ చేస్తోందట. తాను కూడా సినిమాల్లోకి రావడం ఖాయమనే హింట్ ఇచ్చింది గౌతమి.