ప్రముఖ నటి గౌతమి… బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. గత పాతికేళ్లుగా గౌతమి బీజేపీలోనే ఉన్నారు. 2021 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. పార్టీలో తనకు గౌరవం లభించడం లేదని, కొంతమంది వ్యక్తులు తనని నమ్మించి మోసంచ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ గౌతమి పార్టీని వీడారు. అంతే కాదు.. ఇంత కాలం తనకు సన్నిహితుడిగా మెలిగిన అగళప్పన్ అనే వ్యక్తిపైనా గౌతమి తీవ్ర ఆరోపణలు చేశాడు. తన బలహీనతల్ని, అవసరాల్ని ఆసరాగా చేసుకొని అళగప్పన్ తన జీవితంలోకి ప్రవేశించాడని, ఆర్థిక లావాదేవీల విషయంలో తనని మోసం చేశాడన్న విషయాన్ని ఇటీవలే గుర్తించానని, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు కూడాచేశారని గౌతమి పేర్కొన్నారు. అయితే కొంతమంది బీజేపీ పెద్దలు అళగప్పన్కి అండగా నిలబడ్డారని, ఈ విషయంలో తనకి న్యాయం జరక్కుండద అడ్డుగా నిలబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందని, ఆయనే తనకు న్యాయం చేస్తారని ఆశగా ఎదురు చూస్తున్నానని గౌతమి పేర్కొన్నారు. బీజేపీకి రాజీనామా చేసిన గౌతమి ఏ పార్టీలోకి వెళ్తారన్న విషయంలో ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఆమె కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.