దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూర్ రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాలీవుడ్ నటి హేమను సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
మే నెలలో జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నట్లు తేలడంతో ఆమె రక్త నమూనాలను పరీక్షించారు. ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో సీసీబీ పోలీసులు ఆమెకు ఇటీవల నోటీసులు ఇచ్చారు. మే 27న విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. తాను వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నానని కారణం చూపి విచారణకు డుమ్మా కొట్టిన హేమకు మరోసారి నోటీసులు ఇచ్చారు.
జూన్ 1న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్న ఆమె మరోసారి విచారణకు హాజరు కాలేదు. దీంతో ఆమె వైఖరిపై విసుగు చెందిన బెంగళూరు పోలీసులు హేమను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం హేమను కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.