రేవ్ పార్టీనా… నాకే పాపం తెలియదు బాబోయ్ అని బుకాయించి చివరికి దొరికిపోయింది టాలీవుడ్ నటి హేమ. ఆమె రక్త నమూనాలను పరిశీలించగా డ్రగ్స్ పాజిటివ్ అని తేలడంతో బెంగళూర్ రేవ్ పార్టీలో హేమ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే, ఆమె అసలు పేరుతో కాకుండా మరో పేరుతో రేవ్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చినట్లుగా సమాచారం.
బెంగళూర్ రేవ్ పార్టీలో పాల్గొని పాజిటివ్ వచ్చిన వారిలో తెలుగు నటి హేమతోపాటు యువ నటి ఆశూ రాయ్ కూడా ఉన్నారని తెలుస్తోంది. హేమ మాత్రం కృష్ణవేణి అనే పేరుతో రేవ్ పార్టీకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో హేమతో పాటు డ్రగ్స్ పాజిటివ్ అని తేలిన 86మందికి పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు.
ఈ రేవ్ పార్టీలో హేమ పేరు మొదట బయటకు వచ్చినప్పుడు ఈ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని బుకాయించింది హేమ. వీడియోలను రిలీజ్ చేసి కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేసింది. అయితే, తన అసలు పేరుతొ కాకుండా కృష్ణవేణి అనే పేరుతో హేమ ఈ రేవ్ పార్టీకి అటెండ్ అయినట్లుగా తెలుస్తోంది.