రీసెంట్ గా సిని ప్రముఖుల ఇళ్ల మీద ఐటి అధికారులు దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే తెలుస్తున్న కథనాల ప్రకారం ఈ ఐటి దాడులు కావాలనే చేయించారని వెళ్లడవుతుంది. తమిళ స్టార్ హీరో అభిమానులంతా ఇళయదళపతిగా పిలుచుకునే విజయ్ దాదాపు 5 సంవత్సరాల నుండి ఇన్కం ట్యాక్స్ కట్టట్లేదట అందుకే ఐటి అధికారులు కరెక్ట్ గా పులి రిలీజ్ కు ముందు ఎటాక్ చేశారని అంటున్నారు. అదీగాక రాజకీయ కోణాల నుండి కూడా విజయ్ కి శత్రువులుండటం దీనికి కారణం అంటున్నారు.
ఇక నయనతార ఇంట్లో కూడా ఐటి అధికారులు ఎటాక్ చేసిన సంగతి తెలిసిందే. వరుస సినిమాలతో బిజీగా ఉన్న నయన్ తర్వాత చేయబోయే సినిమా ఓ పొలిటికల్ డ్రామాకు సంబంధించినదట అందుకే ఆమెను కూడా అధికార పక్షానికి చెందిన వారే ఇలా చేయించి ఉంటారని అనుకుంటున్నారు. ఇదంతా బాగానే ఉంది అటు విజయ్ కు గాని, ఇటు నయన్ కి గాని సంబంధం లేని సమంత ఇళ్లలో కూడా ఐటి అధికారులు రెయిడ్స్ నిర్వహించారు.
సమంత దగ్గర నల్ల డబ్బు లేదని వారి తల్లితండ్రులు చెబుతున్నా సమంత ప్రత్యూషా ఆర్గనైజేషన్ ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సహాయం అందిస్తుంది. రోగగ్రస్తులైన పిల్లలకు ఆర్ధిక సాయం చేస్తున్న ఈ ఆర్గనైజేషన్లో ఏవన్నా అవకతవకలు జరుగుతున్నాయనే డౌట్ తోనే సమంత ఇళ్ల మీద రెయిడ్స్ జరిపించారట. అయితే సమంత ఫారిన్ షూట్లో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. చివరకు సమంత చారిటీ మీద పూర్తి వివరణ అడిగినట్టుగా తెలుస్తుంది. దర్శకుడు తేజా మొన్నామధ్య హీరోలు.. సినిమాల మీద ఫైర్ అవుతూ అన్న మాట ఇప్పుడు నిజమైందని చెప్పొచ్చు. ఐటి మినహాయింపు కోసమే సెలబ్రిటీస్ అంతా చారిటీలు పెడుతున్నారని కామెంట్ చేసిన తేజ ఆనాడు ఎలా అన్నాడో తెలీయదు కాని ఈ రోజు అదే జరిగి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.