లాక్ డౌన్ కాలంలోనూ పెళ్లి బజాలు మోగుతున్నాయి. సినీ సెలబ్రెటీలు… కొత్త జీవితానికి శ్రీకారం చుడుతున్నారు. కాకపోతే… ఇది వరకటిలా హంగూ, ఆర్భాటాలేం లేకుండా, కోవిడ్ నిబంధనల్ని అనుసరించి… సైలెంట్ గా పెళ్లి చేసేసుకుని, ఆ తరవాత.. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియపరుస్తున్నారు. మొన్నే ప్రణీత పెళ్లి పీటలెక్కింది. ఇప్పుడు యామీ గౌతమ్ కూడా అదే చేసింది. నువ్విలా, గౌరవం లాంటి చిత్రాలతో తెలుగులో మెరిసింది యామీ. విక్కీ డోనర్తో బాలీవుడ్ నీ ఆకట్టుకుంది. ఇప్పుడు దర్శకుడు ఆదిత్య ధార్ ని వివాహమాడింది. `సర్జికల్ స్ట్రైక్ ఉరి` తో అందరినీ మెప్పించాడు ఆదిత్య. ఇప్పుడు విక్కీ కౌషల్ తో మరో సినిమా చేస్తున్నాడు. ఈరోజే యామీ – ఆదిత్యల వివాహం…జరిగింది. ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఆ ఫొటోల్ని నెట్టింట షేర్ చేసింది యామీ.