మచిలీపట్నం పోర్టును కట్టాలని ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలుస్తోంది. రూ. 5835 కోట్ల రూపాయలతో మొదటి దశ డీపీఆర్ సిద్ధం చేసింది. ఇక టెండర్లు వేసుకోండి అని ఆఫర్ ఇచ్చింది. ఇంకేముంది అసలే పోర్టు వెల్లువలా సంస్థలు వస్తాయనుకున్నారు. కానీ ఒక్కరు కూడా వచ్చి టెండర్ వేయలేదు. మొదటి సారిఎవరూ వేయకపోవడంతో రెండో సారి టెండర్లు పిలిచారు. రెండో సారీ అదే పరిస్థితి. దీంతో మరో రెండు వారాల పాటు గడువు పొడిగించాలని అనుకంటున్నారు. ఏపీలో పోర్టులంటే ఎగబడి కొనేస్తున్న అదానీ గ్రూప్ కానీ.. ఏపీలో టెండర్లు పడ్డాయంటే ముందు వరుసలో ఉండే మేఘా కానీ ఈటెండర్లపై ఎందుకు దృష్టి పెట్టలేదో ఎవరికీ అర్థం కావడం లేదు.
అదానీ సంస్థ పోర్టులను నిర్మించడంలో ఆసక్తి చూపిస్తోంది. టీడీపీ హయాంలో శ్రీకాకుళం జిల్లా భావనపాడు వద్ద పోర్టు నిర్మాణానికి ఒప్పందం చేసుకుంది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఒప్పందాన్ని రద్దు చేసి.. మళ్లీ ఒప్పందం చేసుకున్నారు. కానీ ఆ పోర్టు నిర్మాణం ప్రారంభమయిందో లేదో తెలియదు. ఇప్పుడు మచిలీపట్నం పోర్టు కోసం కనీసం టెండర్ కూడా అదానీ సంస్థ ఆసక్తిచూపడం లేదు. కట్టేసి భారీ లాభాల్లో ఉన్న పోర్టులు కృష్ణపట్నం, గంగవరంలను అదానీ సంస్థ టేకోవర్ చేసుకుంది.ఇక చాలనుకుందేమో కానీ మచిలీపట్నం పోర్టును లెక్కలోకి తీసుకోవడం లేదు.
తెలుగుదేశం పార్టీ ప్రభఉత్వ హయాంలో మచిలీపట్నంపోర్టు టెండర్‌ను నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ దక్కించుకుంది. పనులు ప్రారంభించింది. అయితే వైసీపీ ప్రభుత్వం రాగానే పోర్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పోర్టు ప్రాజెక్టుకు సంబంధించిన పలు పనుల కోసం ఇప్పటికే రూ.436కోట్లు వ్యయం చేశామని నవయుగ సంస్థ కోర్టులో పిటిషన్ వేసింది. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో ఉంది. కాంట్రాక్ట్‌ను రద్దు చేసిన ప్రభుత్వం కొత్త వారికి ఇవ్వాలని టెండర్లు పిలుస్తోదంి. కానీ ఎవరూ రావడంలేదు.