గౌతమ్ అదానీకి చెందిన సంస్థలు దేశంలోని విభిన్న రంగాల్లోకి ప్రవేశించి వ్యాపారాలు చేస్తున్నాయి. ఎక్కువగా టేకోవర్ల ద్వారానే ఆయా రంగాల్లో తన ముద్ర చూపిస్తోంది.తాజాగా రియల్ ఎస్టేట్ రంగంలోనూ అదానీకి దేశవ్యాప్తంగా కీలకమైన ముందడుగు వేయబోతోంది. ఎమ్మార్-ఎంజీఎఫ్ ను కొనుగోలు చేసేందుకు అదానీకి చర్చలు జరుపుతోంది. ఎమ్మార్ కు హైదరాబాద్‌లోనూ పెట్టుబడులు ఉన్నాయి. అయితే కేసుల్లో ఉన్నాయి.
అదానీ గ్రూపులో రెండు రియల్ఎస్టేట్ రంగానికి చెందిన అన్ లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. అదాని రియాలిటీ, ఆదాని ప్రాపర్టీస్ అనే కంపెనీలు ఇటీవలి కాలంలో భారీగా ప్రాజెక్టులు చేపడుతున్నాయి. దేశ రియల్ ఎస్టేట్ రంగంలో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఎమ్మార్, ఎంజీఎఫ్ ను టేకోవర్ చేయాలని నిర్ణయించుకుని చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.
గత జనవరిలో ఎమ్మార్ ఇండియా తమ వాటాను అదానీకి అమ్మడానికి చర్చలు జరుపుతున్నామని చెప్పింది. అయితే ఇతర సంస్థలతో కూడా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎమార్ పెట్టుబడులు ఎనిమిదిన్నర వేలకోట్ల వరకూ ఉంటాయి. హైదరాబాద్ లో తక్కువే. అయితే ఆ స్థలాలను న్యాయపరమైన వివాదాల నుంచి విడిపించుకుంటే భారీగా లబ్ది కలుగుతుంది. అందుకే ఎమార్ ను టేకోవర్ చేసుకుని .. విస్తరించాలని ఆదానీ గ్రూపు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే అదానీ గ్రూప్ తెలంగాణ రియల్ మార్కెట్ లోనూ అడుగుపెడుతోందని అనుకోవచ్చు.