భారతదేశంలో అత్యంత సంపన్నుడిగా గౌతమ్ అదానీ మళ్లీ నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ రెండోస్థానానికి పడిపోయారు. అదానీ గ్రూప్ కంపెనీల చైర్మన్ అయిన గౌతమ్ అదానీ తాజాగా బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ లో దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.ఆయన ఆస్తుల నికర విలువ 97.6 బిలియన్ అమెరికన్ డాలర్లు కాగా అంబానీ ఆస్తుల విలువ 97 బిలియన్లే. ఆసియాలోనూ అత్యంత సంపన్నుడిగా అదానీయే నంబర్ వన్ స్థానంలో ఉండటం మరొక విశేషం.
అయితే అదానీ సంపద అంతా స్టాక్ మార్కెట్లలో ఆయన కంపెనీలకు పెరుగుతున్న షెర్ల వాల్యూ మీదనే ఆధారపడి ఉన్నాయి. ఆయన లిస్టెడ్ కంపెనీల్లో ఒక్క దానికి లాభాలు వస్తాయన్న గ్యారంటీ లేదు. ముకేష్ అంబానీ కంపెనీలు వేల కోట్ల పన్నులను కేంద్రానికి కడతాయి. అంతగా సంపద సృష్టిస్తాయి. కానీ.. అదానీ కంపెనీలు ఆదాయపు పన్నే కట్టవు. ఎందుకంటే.. వాటికి ఆదాయం రాదు. ఇలాంటి లొసుగులు ఎన్నో ఉన్నా.. అదానీ గ్రూప్ షేర్లు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.
హిండెన్ బర్గ్ బయట పెట్టిన సంచలన విషయాల తర్వతా ఆయన స్టాక్స్ పడిపోయాయి. ఆ కంపెనీపై దావా వేస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్పారు కానీ.. వేయలేదు. కానీ ఇక్కడ సుప్రీంకోర్టులో సీబీఐ విచారణకు అక్కర్లేదని..సెబీ విచారణ చాలన్న తీర్పు రావడంతో.. మళ్లీ గాలి కొట్టకోవడం ప్రారంభించారు. అదానీ కంపెనీల డొల్ల తనం ఎలాంటిదో చిన్న రిపోర్టుకే కుప్పకూలిన షేర్లు నిరూపిస్తున్నాయి. ఎన్నో వివాదాలున్నా.. విచారణలు ముందుకు సాగడం లేదు. అదానీ వ్యవహారాలపై ప్రశ్నించిన వారికి.. లోక్ సభ సైతం అనర్హతా వేటు వేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.