ఇందులో అందులో కాదు మొత్తంలో అదానీ కనిపిస్తున్నారు. తాజాగా కేంద్రం వేలం వేయబోతున్న 5జీ స్పెక్ట్రం కొనుగోలు కోసం కూడా బరిలోకి దిగారు. దేశంలో దిగ్గజ సంస్థలయిన రిలయన్స్ జియో, ఎయిర్టెడ్, వోడాఫోన్ ఐడియాలతో పాటు తమకూ స్పెక్ట్రం కావాలని బరిలో నిలిచింది అదానీ. ఇంత వరకూ టెలికాం కంపెనీనే లేని అదానీ 5జీ స్పెక్ట్రం ఏం చేసుకుంటారని ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోయాయి. అయితే ఆయన ఇప్పటికే టెలికాం వ్యాపారానికి లైసెన్స్‌లు పొందారు.
తాము 5జీ స్పెక్ట్రం రేసులో ఉన్నట్లుగా బయటపడటంతో అదానీ గ్రూప్ స్పందించింది. తాము కమర్షియల్ 5జీ స్పెక్ట్రం సేవలు అందించడానికి కొనడం లేదని.. సంస్థ అవసరాల కోసం వాడుకుటామని చెప్పుకొచ్చింది. పోర్టులు, ఎయిర్‌పోర్టుల్లో సైబర్ సెక్యూరిటీ కోసం వాడుకుంటామని చెప్పుకొచ్చింది. ఈ వాదన టెలికాం వర్గాలకే కాదు సామాన్య ప్రజలకూ వింతగానే అనిపించింది.ఎందుకంటే 5జీ స్పెక్ట్రం వేలం లో పాల్గొనాలంటేనే రూ. కోట్లు కట్టాలి. ఆ తర్వాత పాడుకోవాలంటే వేల కోట్లు కావాలి. అన్ని కోట్లు ఖర్చు పెట్టి సొంత అవసరాలకు వాడుకుంటారంటే ఎవరూ నమ్మే పరిస్థితి ఉండదు.
కానీ అదానీ మాత్రం సొంతానికే వాడుకుంటామని చెబుతున్నారు. ఇండస్ట్రీ వర్గాలు మాత్రం ఖచ్చితంగా ఆయన ఫైవ్ జీ సర్వీసులు ప్రారంభిస్తారని నమ్ముతున్నారు. అందుకే లైసెన్సులు తీసుకున్నారని వేల కోట్లు ఖర్చు పెట్టి సొంత సంస్థలకు సేవలు అందించుకుంటారా అని భావిస్తున్నారు. మొత్తానికి అదానీకి కేంద్ర ప్రభుత్వానికి ప్రమేయం ఉన్న ప్రతీ అంశంలోనూ సులువుగా పనులు జరిగిపోతూ వస్తున్నాయి. ఫైవ్ జీ లో కూడా అంతే జరిగిపోతుంది. అందులో ఎలాంటి సందేహం ఉండదు.