పవన్ కల్యాణ్ ‘బీమ్లా నాయక్’ ఆడియో ఇప్పటికే సూపర్ హిట్. ఇప్పటివరకూ వచ్చిన మూడు పాటలు ఆడియన్స్ కు తెగ నచ్చాయి. బీమ్లా నాయక్ టైటిల్ సాంగ్, లాల్ లాల్ భీమ్ లాల్, అంత ఇష్టం.,. పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇప్పుడు ఈ సినిమా నుండి నాలుగో పాట బయటికి వచ్చింది. అడవి తల్లి మాట అంటూ విడుదలైన ఈ పాట కూడా చాలా క్యాచిగా వుంది, ఫోక్ సాంగ్ స్టయిల్ లో దిన్ని ట్యూన్ చేశారు. రామ జోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ ఇందులో హైలట్ గా నిలిచాయి.
కిందున్న మడుసులకా కోపాలు తెవలవు..
పైనున్న సామేమో కిమ్మని పలకడు
దూకేటి కత్తులు కనికరం ఎరగవు
అంటున్నకున్న అగ్గిలోన ఆనవాలు మిగలవు
సెప్తున్న నీ మంచి సెడ్డ .. అంతోటి పంతాలు పోవకు బిడ్డ..
సిగురాకు సిట్టడవి గడ్డా
చిచ్చుల్లో అట్టుడికిపోరాదు బిడ్డ..
పుట్టగానే బువ్వపెట్నా … సెలయేటి జింక పాలు పట్న ..
ఊడల్లో వ్యుయలు కట్టి… నిన్ను ఉస్తాద్ అల్లే నిల్చోబెట్టిన
పచ్చిన్ని బతికిస్తే నీకు.. ఎల్లిఎల్లి కచ్చల్ల పడబోకు బిడ్డ..
అంటూ సాగిన సాహిత్యం.. కధలో ఇద్దరి మధ్య వున్న సంఘర్షణకి అద్దం పట్టింది. క్యాచి ట్యూన్ చేయడంలో తమన్ మరోసారి సక్సెస్ అయ్యడానే చెప్పాలి. అయ్యప్పనుమ్ కోషియుమ్ రిమేకే గా వస్తున్న ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకుడు. త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లేయ్. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.