జనసేన మాజీ అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ పార్టీ వీడటానికి కారణం పవన్కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ కి ప్రాముఖ్యత ఇవ్వడమేనా? తాజాగా అద్దేపల్లి శ్రీధర్ చేస్తున్న ట్వీట్లను చూస్తుంటే ఇదే సందేహం కలుగుతోంది.
గతంలో జనసేన అధికార ప్రతినిధిగా వ్యవహరించిన అద్దేపల్లి శ్రీధర్ కు ఆ పార్టీలో చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆయన విషయ పరిజ్ఞానం గురించి మాత్రమే కాకుండా, తమ అభిమాన నాయకుడైన పవన్ కళ్యాణ్ ని ఆయన వివిధ వేదికల మీద డిఫెండ్ చేస్తూ మాట్లాడటం జనసేన అభిమానులకి ఆయన మీద ప్రత్యేక అభిమానం కలిగేలా చేసింది. అయితే ఎన్నికల తర్వాత ఫలితాల కంటే ముందే ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేసారు. ఆయన రాజీనామాకు కారణం ఏంటనేది ఆయన చెప్పకపోవడంతో ఎవరికి తోచిన ఊహాగానాలు వారు చేసుకున్నారు. ఇక పార్టీ వీడిన తర్వాత కొంతకాలం వరకూ సైలెంట్ గా ఉన్న అద్దేపల్లి శ్రీధర్, ఇటీవల జనసేన ను టార్గెట్ చేస్తూ ట్వీట్స్ చేయడం ప్రారంభించారు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ కలిసి చిరంజీవిని కలిసిన సందర్భంగా తీసుకున్న ఫోటోపై కామెంట్ చేస్తూ కేవలం నాదెండ్ల మనోహర్ ను మాత్రమే పవన్ కళ్యాణ్ తీసుకెళ్లడంలో ఆంతర్యమేమిటని అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ ఇద్దరు కలిసి గవర్నర్ను కలిసిన సందర్భంగా తీసుకున్న ఫోటోపై కూడా ఇదే తరహా కామెంట్ చేశారు. పార్టీలోని మిగితా అందర్నీ వదిలేసి కేవలం నాదెండ్ల మనోహర్ ని గవర్నర్ వద్దకు తీసుకు వెళ్ళడంలో పవన్ కళ్యాణ్ ఉద్దేశ్యం ఏమిటి అని ప్రశ్నిస్తూ ఆయన ట్వీట్ చేశారు.
మొత్తానికి మొదటి నుండి పవన్ కళ్యాణ్ కి చేదోడు వాదోడు గా ఉన్న అద్దేపల్లి శ్రీధర్, ఆ తర్వాత పార్టీలో చేరిన నాదెండ్ల మనోహర్ కి పవన్ కళ్యాణ్ అధిక ప్రాధాన్యతనివ్వడం జీర్ణించుకోలేకపోయారని ఆయన చేస్తున్న ట్వీట్లను చూస్తే అర్థమవుతోంది. అదేవిధంగా పార్టీకి ఏడాదిపాటు పని చేసినా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదన్నది కూడా జనసేన పార్టీని వీడడానికి కారణం అయి ఉండవచ్చు.
Leader should take along everyone…not just one, there are many leaders JD, parthsarasdhi, thota chandrasekar, Bharat bhushan, sekar puli..many more..don't ignore ..it is a costly mistake being repeated regularly.@PawanKalyan @JSPVeeraMahila @JanaSenaParty @JSPShatagniTeam pic.twitter.com/6Hwkd2KqcL
— Sridhar Addepalli (@SridharAddepal1) July 28, 2019