రామోజీ చివరి కోరికను తీర్చడంలో నిరంతరం శ్రమించిన ఈనాడు, ఈటీవీ సిబ్బందికి నగదు బహుమతులు ఇస్తోంది యాజమాన్యం. జగన్ లాంటి అరాచక శక్తిని ఓడించడానికి ఈనాడు తన సైన్యంతో ఓ యుద్ధమే చేసింది. అందులో సంచలన విజయం సాధించినట్లే. ఆ తర్వాత రామోజీ ప్రశాంతంగా కన్నుమూశారు. ఇప్పుడు ఆ కారణమో.. లేకపోతే దసరా వస్తుందనో కానీ ఈనాడు, ఈటీవీ ఉద్యోగులకు బోనస్ ఇస్తున్నారు. కుటుంబాలను ఫిల్మ్ సిటీకి పిలిపించి విందు భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.
ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడంలో ఈనాడు గ్రూపు అందరి కంటే ముందే ఉంటుంది. మీడియాలో ఉండే చాలా కంపెనీలు కనీస లేబర్ చట్టాలను పట్టించుకోవు. కానీ పద్దతి ప్రకారం జీతభత్యాలతో పాటు పీఎఫ్, గ్రాట్యూటీ … తక్కువ ధరకే భోజనం, టిఫిన్లు కల్పించే అత్యాధునిక క్యాంటీన్ వసతి వంటివన్నీ కల్పించడం ఈనాడు ప్రత్యేకత. జీతాలు తక్కువ అని కొంత మంది అనుకుంటూ ఉంటారు కానీ.. ఇప్పుడు .. ఈటీవీ, ఈనాడులో ఇచ్చేంత జీతం మరే మీడియా సంస్థలోనూ ఇవ్వడం లేదనేది నిజం.
ఇప్పుడు అదనపు బోనస్ కూడా ఇస్తున్నారు. ఉద్యోగుల్ని గౌరవించడంలో రామోజీ గ్రూప్ ది ఓ ప్రత్యేకత అనుకోవచ్చు. అక్కడ మానేసి ఇతర చోట్ల చేరిపోయిన వారికే ఆ తేడా తెలుస్తుంది.