న్యాయమూర్తి తీర్పు చెబుతారు. ఆ తీర్పును కింది స్థాయి ఉద్యోగులు కంపోజ్ చేసి.. విడుదల చేస్తారు. కానీ న్యాయమూర్తి చెప్పే తీర్పులో.. తమ సొంత వాక్యాలు రాసి… ఆ తీర్పును ఉద్యోగులు విడుదల చేస్తే పరిస్థితి ఏమిటి..? సాధారణంగా ఇంతటి సాహసం ఎవరూ చేయరు…! కానీ ఏపీ హైకోర్టులో మాత్రం అలాంటిదే జరిగింది. హైకోర్టులో శంకర్రెడ్డి, వెంకటరమణ అనే ఉద్యోగులు పని చేస్తున్నారు. వారు కీలక విధుల్లోనే ఉన్నారు. ఓ కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు.. అధికారుల్ని తమ ఎదుట హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే.. అందరూ హాజరయ్యారు కానీ.. మురళీధర్ రెడ్డి అనే కలెక్టర్ మాత్రం హాజరు కాలేదు.
ఎందుకు హాజరు కాలేదని న్యాయమూర్తి ప్రశ్నిస్తే.. మీరే వద్దన్నారు గా.. అని ఆ కలెక్టర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో న్యాయమూర్తులకే షాక్ తగిలింది. వెంటనే… ఆ కలెక్టర్ మురళీధర్ రెడ్డి తరపు న్యాయవాదులు తీర్పులోని ఓ అంశాన్ని చూపించారు. ఉత్తర్వులు అమలు చేసినట్లయితే.. కలెక్టర్ కోర్టు ఎదుట హాజరు కానవసం లేదు అని తీర్పు ప్రతిలో ఉంది. ఆ తీర్పును తాము ఎప్పుడు చెప్పాలని న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు. వెంటనే.. ఏం జరిగిందో తెలుసుకోవాలని అంతర్గత విచారణకు ఆదేశించారు. విచారణలో… శంకర్ రెడ్డి, వెంకటరమణ అనే ఉద్యోగులు.. ఉద్దేశపూర్వకంగా.. న్యాయమూర్తి తీర్పులో కలెక్టర్ హాజరు కానవసరం లేదన్న వాక్యాలు చేర్చారని తేలింది.
దీంతో వారిపై చర్యలకు హైకోర్టు సిద్ధమయిది. న్యాయమూర్తి తీర్పుకే కొత్త అర్థం చెప్పడం.. చెప్పని మాటల్ని.. చెప్పినట్లుగా తీర్పులో రాసి రిలీజ్ చేయడం అంటే.. చిన్న నేరం కాదు. ఇక్కడ శంకర్ రెడ్డి .. కలెక్టర్ మురళీధర్ రెడ్డి కోస అదే పని చేశారు. హైకోర్టు ఏ నిర్ణయంతీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికే.. న్యాయవ్యవస్థపై కొంత మంది రకరకాల ఒత్తిళ్లకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్న తరుణంలో కొత్తగా … తీర్పులు కూడా మ్యానిపులేట్ చేసే ఉద్యోగులు హైకోర్టులో తయారవడం… అందర్నీ కలచి వేస్తోంది.