టెన్త్, ఇంటర్ పరీక్షల్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్ని ఇన్విజిలేటర్లుగా నియమిస్తామని విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించడం కలకలం రేపుతోంది. ప్రతి పనికి ఇలా.. వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకే బాధ్యతలు అప్పచెప్పేందుకు ప్రభుత్వం ఉత్సాహపడటం.. విస్మయపరుస్తోంది. విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన వ్యవహారం కావడంతో.. విద్యా రంగంలోనూ.. ప్రభుత్వ నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. టెన్త్, ఇంటర్ పరీక్షల ఇన్విజిలేషన్.. కేవలం.. వాళ్లు కాపీ కొడుతున్నారో లేదో చూడటం వరకు మాత్రమే కాదు.. అంతకు మించి ఉంటుంది. ప్రశ్నా పత్రాలు.. ఓ అరగంట ముందే వారి చేతికి చేరుతాయి.
నేటి స్మార్ట్ కాలంలో… అవి బయటకు పోవడం… సెకన్లలో పని. ఎంతో బాధ్యతగా ఉండేవారు..ఇలాంటి ఇన్విజిలేషన్ పనుల్లో ఉండాలి. అదే సమయంలో.. పేపర్లు మారిపోకుండా.. గందరగోళం కాకుండా.. ఓ క్రమ పద్దతిలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అందుకే.. వీలైనంత మంది సీనియర్ ఉద్యోగులను.. ప్రభుత్వం ఇన్విజిలేషన్‌కు ఉపయోగించుకుంటుంది. అది కూడా పూర్తిగా… విద్యా సంబంధిత రంగంలో ఉన్న వారినే ఇప్పటి వరకూ ఇన్విజిలేటర్లుగా ఉపయోగించుకున్నారు కానీ.. బయట విభాగాలకు చెందిన వారికి ఎప్పుడ బాధ్యతలు ఇవ్వలేదు. మొదటి సారిగా ప్రభుత్వం… గ్రామ, వార్డు వాలంటీర్లుకు ఈ బాధ్యతలు ఇవ్వాలనుకుంటోంది.
వారు అక్రమాలకు పాల్పడతారని కాదు ..కానీ తెలియని పనులు చేయడం వల్ల వచ్చే ఇబ్బందులన్నీ.. విద్యార్థులే భరించాల్సి వస్తుంది. అదే సమయంలో పరీక్షలు జరిగినంత కాలం… వారు గ్రామ, వార్డు సచివాలయ విధులకు దూరం కావాలి. అప్పుడు ప్రభుత్వం పెట్టిన క్యాలెండర్ ప్రకారం.. సేవలు అందించడానికి సాధ్యం కాదు. ఎలా చూసినా… విద్యావ్యవస్థలోకి.. గ్రామ, వార్డు వాలంటీర్లను.. చొప్పించే ప్రయత్నం చేయడం మాత్రం… విద్యారంగంలో కలకలం రేపుతోంది.