పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా టీజర్ పై చాలా విమర్శలు వచ్చాయి రామాయణాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలోని నటీనటుల లుక్స్‌పై కొంత మంది పెదవివిరిస్తే.. మరికొందరు టీజర్ లో విజువల్ ఎఫెక్ట్స్ పై తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. అయితే ఇప్ప్పుడీ టీజర్ ని 3డీలో మీడియా కోసం ప్రదర్శించారు. 3డీ టీజర్ చాలా బావుంది. విజువల్స్ అన్నీ చాలా ఎఫెక్టివ్ గా కనిపించాయి. విజువల్స్ లో డెప్త్ కనిపించింది. పాత్రల్లో కూడా సహజత్వం వచ్చింది.
నిజానికి ‘ఆదిపురుష్’ 3డీ ఎక్స్ పీరియన్స్ కోసం తీసిన సినిమా. అయితే ప్రమోషన్స్ ఓ భాగంగా మాములుగా విడుదల చేయకతప్పలేదు. త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాలతో దాదాపు 60 థియేటర్స్ లో 3డీ టీజర్ ని ప్రదర్శించడానికి ఏర్పాటు చేస్తున్నట్లు సినిమా యూనిట్ చెప్పింది. అంతేకాదు తర్వలోనే ఈ సినిమా నుండి మరో స్ట్రాంగ్ కంటెంట్ ని కేవలం త్రీడీలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ప్రభాస్ చెప్పారు. మొత్తానికి 3డీ టీజర్ లో‘ఆదిపురుష్’ అదుర్స్ అనిపించింది. ఇకపై ఈ సినిమా నుండి విడుదల చేసే ప్రమోషనల్ కంటెంట్ త్రీడీలో ప్రదర్శించేలా నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు.