ప్రభాస్ పాన్ ఇండియా సినిమా ‘ఆదిపురుష్’ మొదలై చాలా కాలమైంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయ్యింది. అయితే ఇప్పటి వరకూ ఫస్ట్ లుక్ కూడా బయటకు రాలేదు. ఎన్ని పండగలు వచ్చినా, ప్రభాస్ పుట్టినరోజులు ఎన్ని వెళ్లిపోయినా – ఎలాంటి అప్ డేట్ రాలేదు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు వాళ్లందరికీ ఓ స్వీట్ న్యూస్. ‘ఆదిపురుష్’ ఫస్ట్ లుక్‌కి రంగం సిద్ధమైంది. దసరా సందర్భంగా అక్టోబరు 2న `ఆదిపురుష్` ఫస్ట్ లుక్ బయటకు రానుంది. ఇక నుంచి.. వరుసగా ఆదిపురుష్‌కి సంబంధించిన అప్ డేట్లు వదలాలని చిత్రబృందం భావిస్తోంది. దీపావళి కూడా అక్టోబరులోనే. అక్టోబరు 23న ప్రభాస్ పుట్టిన రోజు. 24న దీపావళి. అప్పుడు కూడా ‘ఆదిపురుష్’ కి సంబంధించిన టీజరో, గ్లిమ్సో వదలాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన చిత్రమిది. కృతిసనన్ సీత పాత్రలో కనిపించబోతోంది. సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా దర్శనమివ్వనున్నాడు. 2023లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.