తమిళ డబ్బింగ్ బొమ్మ ‘అదిరింది’పై చాలా చర్చ జరిగింది. తమిళంలో సూపర్ హిట్ అవ్వడం, ఇక్కడ రీమేక్ చేయడం కోసం ప్రయత్నాలు చేయడం, సెన్సార్ విషయంలో ఇబ్బందులు తలెత్తడం… దాంతో తెలుగులో అదిరిందిపై హైప్ పెరుగుతూ వచ్చింది. డబ్బింగ్ రైట్స్‌ని శరత్ మరార్ రూ.4 కోట్లకు కొనుగోలు చేశారు. విజయ్ సినిమాకి ఇది మంచి రేటే. ఆ పెట్టుబడి రాబట్టుకొనే వీలూ ఉంది. అయితే.. ఈ సినిమాపై అనుమానాలేమైనా వచ్చాయేమో, విడుదలకు ముందే ఈ సినిమాని శరత్ మరార్ వదులుకొన్నట్టు సమాచారం. తాను ఖర్చు పెట్టిన ప్రతీ పైసా వెనక్కి తీసుకొని – ఈ రైట్స్‌ని తమిళ నిర్మాతలకే అప్పగించినట్టు తెలుస్తోంది. తొలిరోజు ‘అదిరింది’కి మంచి వసూళ్లే వచ్చాయి. బీసీ సెంటర్లలో ఈ వారాంతంలో అదిరింది హవా చూపించే అవకాశం ఉంది. శరత్ నిర్ణయం తనకు మంచే చేసిందా, లేదంటే తొందరపడ్డాడా అనేది మరో రెండ్రోజుల్లో తేలిపోనుంది. ఈ వారం విడుదలైన చిత్రాల్లో అదిరిందకే వసూళ్లు బాగా కనిపిస్తున్నాయి. ‘డిటెక్టీవ్’ ఏ సెంటర్లకే పరిమితం అయ్యే ఛాన్స్ ఉంది. ‘ఒక్కడు మిగిలాడు’, ‘కేరాఫ్ సూర్య’ వసూళ్లు నిర్మాతల్ని కలవరపెడుతున్నాయి.