ఈమధ్య పరభాషా కథానాయికలు తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడానికి సాహసిస్తున్నారు. సమంత, కీర్తి సురేష్, సాయి పల్లవి.. వీళ్లంతా ఇప్పుడు తెలుగులోనే మాట్లాడుకుంటున్నారు. తెలుగులోనే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఈ దారిలో మరో హీరోయిన్ వచ్చేసింది. తనే అతిథిరావు హైదరీ. మణిరత్నం ‘చెలియ’`తో టాలీవుడ్‌కి పరిచయమైంది హైదరీ. ఇప్పుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సమ్మోహనం’లో కథానాయికగా కనిపిస్తోంది. ఈ పాత్ర కోసం అతిథి.. తనకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. ఇంద్కగంటి సినిమాల్లో కథానాయిక పాత్రలకు ప్రాధాన్యం ఉంటుంది. ఓ విధంగా చెప్పాలంటే.. హీరోయిన్ పాత్రలే కథని మలుపుతిప్పుతుంటాయి. ఇందులో హైదరీకి అలాంటి పాత్రే దక్కిందని తెలుస్తోంది. ఆ పాత్ర ఇంకా బలమైన ముద్ర వేయడానికి తనతోనే డబ్బింగ్ చెప్పించారు. ఇక మీదట పరభాషా కథానాయికలంతా తెలుగులోనే మాట్లాడేస్తుంటే.. డబ్బింగ్ ఆర్టిస్టుల అవసరమే ఉండదు.