బాలకృష్ణ హీరోగా నటించిన టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ఆదిత్య 369’. సంగీతం దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆల్ టైం క్లాసిక్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11న రీ రిలీజ్ చేస్తున్నారు.
రీరిలీజ్ కోసం సినిమా సరికొత్తగా ముస్తాబైయింది. 4kలో డిజిటలైజ్ చేశారు. అలాగే సౌండ్ కూడా 5.1 క్వాలిటీలోకి కన్వర్ట్ చేశారు. ఆరు నెలల పాటు శ్రమించి హెడ్డీ లోకి మార్చారు. బాలయ్య.. శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణ కుమార్‌గా… రెండు పాత్రల్లోనూ అద్భుతమైన నటన కనబరిచిన ఈ చిత్రం పెద్ద మ్యూజికల్ హిట్ కూడా. ఇందులో పాటలన్నీ ఇప్పటికీ ఫేవరేట్.
అన్నట్టు ఈ సినిమాకి సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు బాలయ్య. ఆయనే కథ, కథనాలు రాసేపనిలో వున్నారు. మోక్షజ్ఞతో ఈ ప్రాజెక్ట్ వుంటుంది. ఇలాంటి సమయంలో ‘ఆదిత్య 369’ మళ్ళీ రిలీజ్ కి రావడం అభిమానులకు సంబరమే.