సున్నితమైన, ఆరోగ్యకరమైన వినోదంతో ఆకట్టుకోవడం ఇంద్రగంటి మోహనకృష్ణ ప్రత్యేకత! అష్టా చమ్మా నుంచీ ఆయన స్టైల్ అదే. ఇప్పుడు ఆయన్నుంచి మరో సినిమా వస్తోంది. అదే… అమీ తుమీ. ఈ సినిమాలో ఇద్దరు హీరోలున్నారు. ఒకరు అవసరాల శ్రీనివాస్, మరోకరు అడవిశేష్. ట్రైలర్ చూస్తుంటే మాత్రం వీరిద్దరినీ వెన్నెల కిషోర్ డామినేట్ చేసేశాడనిపిస్తోంది. 1 నిమిషం నలభై సెకన్లున్న ట్రైలర్లో అవసరాల శ్రీనివాస్, అడవిశేష్లతో పోలిస్తే వెన్నెల కిషోర్‌కే డైలాగులు ఎక్కువ పడ్డాయి. కొన్ని పంచ్‌లు పేలాయి.. మణి ఆర్ ఆర్ కూడా ఓకే అనిపిస్తోంది. రెండు జంటలు, ఓ ఇల్లు.. కొన్ని చిత్ర విచిత్రమైన క్యారెక్టర్ల నడుమ సినిమా లాగించేసినట్టు కనిపిస్తోంది. ఎక్కడో ఓ చోట వంశీ సినిమా చూస్తున్న ఫీలింగ్ రాక మానదు. వినోద ప్రధానంగా సాగిన ఈ ట్రైలర్… సినిమా జోనరేమిటో తేల్చేసింది. ఇక ఫైనల్ రిపోర్టే కావాలి. జెంటిల్మెన్ తరవాత ఇంద్రగంటి నుంచి వస్తున్న సినిమా ఇది. కాబట్టి అంచనాలు బాగానే ఉన్నాయి. వాటిని అందుకొనే స్టఫ్ ట్రైలర్ లోనూ కనిపిస్తోంది. కాకపోతే…. ఇద్దరు హీరోలకే డైలాగులు బొత్తిగా లేవు. సినిమాలోనైనా వాళ్ల హీరోయిజం చూపిస్తారా, లేదంటే వెన్నెల కిషోర్‌నే హైలెట్ చేస్తారా..?? చూడాలి మరి.