హిట్, మేయర్ లాంటి సినిమాలతో మరింత పాపులారిటీ సంపాదించుకొన్నాడు అడవిశేష్. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థలో ఓ భారీ చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ‘డెకాయిట్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. శశికిరణ్ తిక్కా ఈచిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి. అతనికి కుదరని పక్షంలో శేష్ దర్శకత్వ బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం. సుప్రియ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తారు. మేజర్ లానే ఈ చిత్రాన్నీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి కథ,స్క్రీన్ ప్లే, మాటలు అన్నీ.. అడవిశేష్ అందిస్తుండడం విశేషం. `డెకాయిట్` అంటే తెలుగులో మోసం అని అర్థం. టైటిల్ ని బట్టి చూస్తే క్రైమ్ జోనర్లో సాగే సినిమా అని అర్థమవుతోంది. శేష్ ఏ పాయింట్ ఎత్తుకొన్నా, దాన్ని కొత్తగా, ఇంటర్నేషనల్ స్థాయిలో తీస్తుంటాడు. ఈసారీ.. అదే పంథాలో ఈ కథని చెప్పబోతున్నట్టు టాక్. శేష్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.