ఫుల్ లెంగ్త్ హీరోగా సరైన హిట్ లు కొట్టాలని అడవి శేష్ కోరిక. క్షణం సినిమాతో అది కొంత వరకు తీరింది. మళ్లీ అందుకే అదే జోనర్ కు కాస్త దగ్గరగా స్పై యాక్షన్ సినిమాను చేస్తున్నాడు. అభిషేక్ పిక్చర్స్, పీపుల్స్ మీడియా కలిసి నిర్మించే ఆ చిత్రమే గూఢచారి. ఈ సినిమా టీజర్ బయటకు వచ్చింది. శోభిత ధూళిపాల హీరోయిన్. నాగార్జున మేనగోడలు సుప్రియ చిన్న పాత పోషించడం విశేషం.
జేమ్స్ బాండ్ సినిమాల తరహాలో తీసినట్లు కనిపిస్తోంది. ఆ లెవెల్ లో కాకున్నా, ఆ లైన్ లో వెళ్లినట్లు యాక్షన్ సీన్లు, గన్ ఎన్ కౌంటర్ లు, ఛేజ్ లు, అన్నింటికి మించి లిప్ టు లిప్ సీన్ చెప్పకనే చెబుతున్నాయి.
సుమారు ఆరున్నర కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో అడవి శేష్ ‘రా’ ఏజెంట్ గా కనిపిస్తున్నాడు. మరి అతగాడు ఏ మిషన్ మీద ఇదంతా చేసాడో, మధ్యలో ఈ లిప్ టు లిప్ ప్రేమాయణం ఏమిటో సినిమా విడుదలయితే కానీ తెలియదు.