ఓ సినిమా హిట్ అయితే దానికి థియేటర్స్ లో వచ్చే లాభాల మాట అటుంచితే శాటిలైట్ రూపంలో వచ్చే మొత్తం కూడా నిర్మాతను లాభాల పంట పండిస్తాయి. ప్రస్తుతం పివిపి బ్యానర్ అధినేత పరం వి పొట్లూరి ఆ జోష్ లోనే ఉన్నారనుకుంట. భారీ నిర్మాణ విలువలతో సినిమాలు తీస్తున్నా ఒక్కటి ఊహించిన విజయం అందుకోని పివిపి ‘క్షణం’ అంటూ వచ్చి సూపర్ హిట్ కొట్టారు.
రవికాంత్ పారెపు దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఫిబ్రవరి 26న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఇప్పటికే లాభాల బాట పట్టిన ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా భారీ రేటు పలికాయట. అడివి శేష్, అదా శర్మ, అనసూయ నటించిన ఈ సినిమాకు 2.7 కోట్లతో శాటిలైట్ రైట్స్ పొందిందట ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్. కోటి బడ్జెట్ తో తీసిన ఈ సినిమా అంత భారీ రేంజ్ లో శాటిలైట్ అవ్వడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయమే.
అయితే చిన్న సినిమాతో పెద్ద విజయం అందుకున్న పివిపి ఈ సినిమా చూపిన మార్గంలోనే ఇకనుండి తన బ్యానర్ లో చిన్న సినిమాలను కూడా నిర్మించబోతున్నాడని టాక్. ఏది ఏమైనా పివిపి హిట్ కొడితే ఏ రేంజ్ లో ఉంటుందో చిన్న సినిమా అయినా సరే క్షణం ఆ రేంజ్ ను చూపించిందన్నమాట.