దివ్వెల మధురీ అనే ఆమె తాను ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను అడల్టరీ బంధంలో ఉన్నామని అదేమీ చట్ట వ్యతిరేకం కాదని మీడియా ముందు వాదిస్తోంది. అడల్టరీ అంటే… శారీరక సంబంధమే. ఇదేమీ తప్పు కాదని ఆమె వాదన. సుప్రీంకోర్టు కూడా చెప్పిందని అంటోంది. పెళ్లి కాని వాళ్లు చేస్తే సహజీవం అని అదే పెళ్లి అయిన వాళ్లు చేస్తే అడల్టరీ అని ఆమె సమర్థించుకుంటోంది.
దివ్వెల మాధురీ చెబుతున్నది నిజమే. వివాహితుడైన వ్యక్తి, వివాహం చేసుకున్న మరో మహిళతో శారీరక సంబంధం పెట్టుకోవడం అడల్టరీ.. అది శిక్షార్హమైన నేరం కాదని సుప్రీం కోర్టు 2018 లో ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసింది. ఈ తీర్పు చెప్పక ముందు వరకూ తన భార్యతో కాకుండా మరో వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం నేరం. తర్వాత ఎవరిష్టం వచ్చినట్లుగా వారు వివాహేతర బంధాలుపెట్టుకోవచ్చన్నట్లుగా మారింది.
Read Also : దువ్వాడ ఫ్యామిలీలో చిచ్చుకు సజ్జలే అసలు కారణం !
అయితే ఈ అడల్టరీ కారణంతో విడాకులు తీసుకోవచ్చు. ఈ అడల్టరీ నైతికంగా కరెక్ట్ కాదని.. వివాహ వ్యవస్థను ముగింపు పలికే తప్పుడు చర్యగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. తాము కలిసి ఉండటం.. శారీరక సంబంధం కొనసాగించడాన్ని అడల్టరీగా చెప్పుకుని.. చట్ట పరంగా సమస్యలు లేకుండా మాధురీ, దువ్వాడ శ్రీను చూసుకుంటున్నారు. కానీ నైతికంగా చూస్తే ఇద్దరికీ వేర్వేరు కుటుంబాలు ఉన్నాయి. పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు వారు సమాజానికి ఏం సందేశం ఇస్తారు ?