పుస్తక ప్రియుడైన బిజెపి కురువృద్ధుడు ఎల్కె అద్వానీకి తన గురించి వెలువడిన పుస్తకమే ప్రాణసంకటంగా మారింది. 2013లో నరేంద్ర మోడిని ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదించడం అద్వానీ జీర్ణం చేసుకోలేని పరిణామం. తన అసంతృప్తిని ఆయన అనేకసార్లు వెళ్లగక్కారుకూడా. నిజానికి అద్వానీ దేశ ప్రధాని పదవి అధిష్టించే విషయంలో విఫలమనోరథుడిగానే మిగిలిపోయారు. తన రథయాత్రతో మతతత్వం రగిలించి బిజెపిని అధికార శిఖరాల్లోకి తీసుకుపోయిన ఘనత దక్కించుకున్నా ఆమోద యోగ్యత రీత్యా ప్రధానిగా వాజ్పారునే ప్రతిష్టించాల్సి వచ్చింది. 2004లో పార్టీ ఓటమి తర్వాత జిన్నాపై ప్రశంసల ఫలితంగా సంఘపరివార్ ఆగ్రహాన్ని కూడా చవిచూశారు. 2009లో ఆయనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినా విజయావకాశాలు చేరువలో కూడా లేవని దేశమంతటకీి తెలుసు. 2013 సెప్టెంబరులో మోడిని ఎంపిక చేసిన బిజెపి ఉన్నతస్థాయి సమావేశానికి ఆయన హాజరు కాలేదు. అయితే సమావేశమైన బిజెపి ప్రముఖులకు ఆయన ఒక లేఖ రాశారు. ఈ సంప్రదింపుల్లో తాను పాల్గొనకపోవడమే మంచిదని భావిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.వాస్తవంగా ఆయన వెళ్లాలని బయలుదేరితే కొంతమంది బలవంతంగా అడ్డుకోవడం వల్లనే ఆయన హాజరుకాలేకపోయారంటారు అద్వాని సన్నిహిత అనుచరుడైన విశ్వాంబర్ శ్రీవాత్సవ. ఇతరులు అడ్డుకోవడం నిజం కాదా? లేక పరువు కాపాడుకోవడానికి తర్వాత లేఖ రాశారా? చెప్పాల్సింది ఆయనే ! అద్వానీకే సాత్ 32 సాల్ ( అద్వానీతో ముప్పైరెండేళ్లు) అన్న తేన ఆయన పుస్తకం విడుదల సందర్భంలో శ్రీవాత్సవ ఈ విషయం చెప్పారు. బిజెపి ఎంపి వివాదాల సుబ్రమణ్యస్వామి, మోడి వ్యతిరేేకిగాపేరున్న్త కెఎన్ గోవిందాచార్య ఢిల్లీలో ఈ పుస్తకం విడుదల చేశారు. ఈ విషయాలపై వివాదం రావచ్చని ముందే ఊహించిన అద్వానీ శిబిరం పుస్తకంతో సంబంధం లేదని ప్రకటించింది. ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా శ్రీవాత్సవ పుస్తకం రాశారని ఒక ప్రకటన వెలువడింది. అయితే తన పుస్తకాన్ని అద్వానీ ముందే చూశారని ఆయన సూచన మేరకు కొన్ని భాగాలు ఎడిటింగ్ చేశానని కూడా శ్రీవాత్సవ అంటున్నారు. . అద్వానీ పుస్తకం చూడడమే కాక సంతకం కూడా చేశారని శ్రీవాత్సవ ఒక ఫోటో విడుదల చేశారు. అలాంటి వ్యక్తి నుంచి పుస్తకంతో సంబంధం లేదని ప్రకటన రావడం ఆశ్చర్యకరమన్నారు. మరి ఇందులో ఏది వాస్తవమో చెప్పాల్సింది వృద్ధ నాయకుడే