ఇంగ్లాండ్‌తో హోమ్ సిరీస్ తొలి టెస్టులో ఘోరపరాజయం పాలైన టీమిండియా రెండో టెస్టులో … ఇంగ్లాండ్‌కు అదే తరహా ట్రీట్మెంట్ ఇచ్చేందుకు సిద్దమయింది. రెండో రోజు ఆట ముగిసే సరికి పూర్తి స్థాయిలో పట్టు బిగించింది. మొత్తంగా ఇప్పటికే 249 పరుగుల ఆధిక్యం సాధించింది. మరో తొమ్మిది వికెట్లు చేతిలో ఉన్నాయి. మరో వంద నుంచి నూట యాభై పరుగులు జోడించినా… ఇంగ్లాండ్‌కు లక్ష్యం సాధించడం అసాద్యంగా మారుతుంది. ఎందుకంటే… ఇంగ్లాండ్ జట్టు చేపాక్ పిచ్‌లో రెండో రోజే తేలిపోయింది. కేవలం 134 పరుగులకే ఆలౌటైంది. సొంత గడ్డపై స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గడగడలాడించారు.
ఐదు కీలక వికెట్లు తీసి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను కుప్ప కూల్చాడు. తొలి రోజు చేపాక్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించింది. తొలి రోజు రోహిత్ శర్మ ధాటిగా బ్యాటింగ్ చేయడంతో మూడు వందల పరుగులు చేసింది. రెండో రోజు స్పిన్ టర్న్ కావడంతో మరో ఇరవై తొమ్మిది పరుగులు మాత్రమే జోడించి టీమిండియా ఆలౌటైంది. అయితే ఆ ఆనందం.. ఇంగ్లాండ్‌కు ఎంతో సేపు నిలువలేదు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా ఔటయ్యాడు. ఓపికగా ఆడితే పరుగులు వచ్చే పిచ్ కావడంతో.. టీమిండియా బ్యాట్స్ మెన్ కుదురుకుంటారని అంచనా వేస్తున్నారు.
ఇంగ్లాండ్ ఆటగాళ్లు తొలి ఇన్నింగ్స్‌లోనే బోల్తా కొట్టడంతో రాను రాను మరింత స్పిన్‌కు అనుకూలగా మారుతున్న పిచ్ కారణం నాలుగో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదని అంచనా వేస్తున్నారు. తొలి టెస్ట్ తరహాలోనే ఇంగ్లాండ్‌కు ఓటమి రుచి చూపిస్తారని..ఇండియన్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికైతే భారత్ కు ఆ అడ్వాంటేజ్ ఉంది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు అద్భుతం చేస్తే తప్ప.. ఓటమి నుంచి తప్పించుకోవడం అసాధ్యం.