అజయ్ భూపతి సినిమాకి మంచి రిలీజ్ డేట్ దొరికింది. ఆయన దర్శకత్వంలో రూపొందిన `మంగళవారం` ఈ శుక్రవారం వస్తోంది. ఈ వారం ఈ సినిమాకి పెద్దగా పోటీ లేదనే చెప్పాలి. మై నేమ్ ఈజ్ శ్రుతి అనే ఓ సినిమాతో పాటుగా, స్పార్క్ అనే ఓ చిన్న సినిమా ఈ వారం విడుదల అవుతున్నాయి. `మంగళవారం` క్రేజ్, హైప్ ముందు ఈ రెండు సినిమాలూ నిలబడడం కష్టం. ఆ రకంగా… ఇది సోలో రిలీజ్ లాంటిదే.
`మంగళవారం` అజయ్ భూపతి కెరీర్లో డూ – ఆర్ – డై లాంటి సినిమా. ఎందుకంటే.. ఆర్.ఎక్స్ 100తో వచ్చిన ఇమేజ్ మొత్తం.. `మహా సముద్రం`లో కలిసిపోయింది. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో హీరోలెవరూ అజయ్ కి అవకాశాలు ఇవ్వలేదు. కనీసం కథ కూడా వినలేదు. ఈ బాధంతా.. తను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో వెల్లగక్కాడు. అందుకే ఈ సినిమాతో హిట్టు కొట్టి, తను మళ్లీ లైమ్ లైట్ లోకి రావాల్సిన అవసరం చాలా ఉంది. టీజర్, ట్రైలర్ బాగున్నాయి. టెక్నికల్ గా స్ట్రాంగ్ గా ఉన్నట్టు అర్థం అవుతుతోంది. థ్రిల్లర్ జోనర్‌కి ఇప్పుడు మంచి గిరాకీ ఉంది. ఈ నేపథ్యంలో ఏమాత్రం విషయం ఉన్నా – జనం చూడ్డానికి రెడీ గానే ఉంటారు. అన్నిటికి మించి బాక్సాఫీసు దగ్గర పెద్దగా పోటీ లేదు. ఎలా చూసినా… మంగళవారానికి మంచి శుకునాలే కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో స్టార్లు లేరు. ఒకవేళ సినిమా హిట్టయితే.. ఆ క్రెడిట్ అంతా దర్శకుడిదే. `ఆర్.ఎక్స్ 100` మ్యాజిక్ రిపీట్ అయితే… అజయ్ భూపతి ఎక్కడ పోగొట్టుకొన్నాడో, అక్కడ సంపాదించుకోవడానికి మార్గం దొరికేసినట్టే.