మళ్లీ మూడు రాజధానుల బిల్లు తెలుస్తామంటూ అవసరం లేకపోయినా ఏపీ సర్కార్ వేసిన అఫిడవిట్ ఇప్పుడు ఆ పిటిషన్లపై విచారణను మరికొంత కాలం కొనసాగేలా చేస్తోంది. రాజధాని పిటిషన్లపై విచారణ కొనసాగించాలని రైతుల తరపు న్యాయవాదులు హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు.మూడు రాజధానుల బిల్లులను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకున్నప్పటికీ.. మళ్లీ బిల్లులు తెస్తామని చెబుతున్నందున విచారణ కొనసాగించాల్సిందేనని రైతుల తరపు లాయర్లు హైకోర్టు ధర్మాసనానికి విన్నవించారు.
ప్రభుత్వం విచారణ జరుగుతున్న సమయంలోనే కన్ని సంస్థలను బయటకు తరలించారని సెలక్ట్ కమిటీ ఆమోదం లేకుండానే బిల్లును ఆమోదించినట్లు పేర్కొని రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఇతర న్యాయవాదులు వాదించారు. విచారణ కొనసాగింపు… ఇతర అంశాలపై పది రోజుల్లో పూర్తి స్థాయి కౌంటర్ వేయాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అదే సమయంలో పిటిషనర్ల తరపున లాయర్లు తమ అఫిడవిట్లను పది రోజుల్లో దాఖలుచేయాలని సూచించింది. తదుపరి విచారణ జనవరి ఇరవై ఎనిమిదో తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ రోజున పూర్తి స్థాయి వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది.
ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల బిల్లు, అలాగే సీఆర్డీఏబిల్లును రద్దు చేయడంపై రైతులు పిటిషన్లు వేశారు. దీనిపైరోజు వారీ విచారణ జరుగుతున్న సమయంలో ఏపీ ప్రభుత్వం అనూహ్యంగా బిల్లులు ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకుంది. విచారణ ముగించాలని కోరారు. అయితే వై ఓ అదనపు అఫిడవిట్లో మళ్లీ మూడు రాజధానులు తీసుకు వస్తామని కోర్టుకు తెలిపింది. దీంతో హైకోర్టులో పిటిషన్లపై విచారణ కొనసాగించాలన్న డిమాండ్‌ను రైతులు మళ్లీ వినిపిస్తున్నారు.