టీ20 ప్రపంచకప్ చరిత్రలో దక్షిణాఫ్రికా తొలిసారి ఫైనల్కు దూసుకెళ్లింది. సెమీఫైనల్-1 మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కీలక మ్యాచ్లో ఆల్రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఇప్పటి వరకు అనూహ్య విజయాలతో అందరి దృష్టినీ ఆకర్షించిన అఫ్గాన్ ఈ మ్యాచ్లో చేతులెత్తేసింది. దక్షిణాఫ్రికాపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. కేవలం 56 పరుగులకే పరిమితమైంది. ఒక్క వికెట్ నష్టానికి టార్గెట్ ని సాధించింది సఫారీ జట్టు.
అయితే ఈ వరల్డ్ కప్ లో ఆఫ్గాన్ జట్టు ఆట తీరు అభినందించదగ్గది. వరల్డ్ అంటే పెద్ద జట్లే ముందంజ వేస్తాయని అందరూ ఊహిస్తారు. పసి కూనలు పోటీలో ఉన్నా అవి కేవలం లీగ్ దశకే పరిమితం అవుతాయి. ఆ జట్లు ఒక్క మ్యాచ్ గెలిచినా ఆశ్చర్యపోతారు. అలాంటిది ఒక్క మ్యాచ్ గెలవడం కాదు ఏకంగా సెమీఫైనల్ చేరడం అద్భుతం. అఫ్గానిస్థాన్ ఈ అద్భుతమే చేసింది.
పోటీలో ఎన్నో బలమైన జట్లు ఉన్నా అన్నింటిని తోసిరాజని టాప్-4లో స్థానాన్ని దక్కించుకుంది. 20 జట్లు పోటీపడిన ప్రపంచకప్లో నాలుగో స్థానంలో నిలిచి వావ్ అనిపించింది. సెమిస్ లో కూడా అద్భుతం చేస్తుందని అందరూ భావించారు. కానీ కీలక మ్యాచ్ లో ఆ జట్టు తడబడింది. అయితే ఓటమి పాలైనప్పటికీ ఈ వరల్డ్ కప్ లో అద్భుత విజయాలతో ఇకపై తాము పసికూనలం కాదని క్రికెట్ ప్రపంచానికి చాటి చెప్పింది అఫ్గానిస్థాన్.