హైదరాబాద్: సంచలనాలకు, వివాదాలకు మారుపేరైన రాంగోపాల్‌వర్మ చాలాకాలం తర్వాత మళ్ళీ సక్సెస్ సాధించారు. ఆయన తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలో రూపొందించిన కిల్లింగ్ వీరప్పన్ చిత్రం మొన్న నూతన సంవత్సరం రోజున కన్నడ భాషలో విడుదలయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. సినిమాలో కథనం, సాంకేతిక విలువలు బాగుండటంతో పాటు చిత్రకథలో కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ కిడ్నాప్ ఉదంతం ఉండటం, రాజ్ కుమార్ కుమారుడు శివరాజ్ కుమార్ ఈ చిత్రంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ పాత్ర పోషించటంతో కన్నడ వెర్షన్‌కు బాగా క్రేజ్ వచ్చింది. సోషల్ మీడియాలో కూడా చిత్రంపై ప్రశంశలు కురిపిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీలో కోర్ట్ కేసుల కారణంగా 1న విడుదల కాలేదు. తెలుగు వెర్షన్ ఈ నెల 7న విడుదల కాబోతున్నట్లు వర్మ ట్వీట్ చేశారు. అసలు వీరప్పన్ చనిపోయే ముందు ప్రయాణించిన అంబులెన్స్‌ను నడిపిన డ్రైవర్ శరవణన్‌తో తాను దిగిన ఫోటోను వర్మ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.