ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అత్యంత వ్యూహాత్మకంగా.. అటు అభివృద్ధి, సంక్షేమం… ఇటు రాజకీయం కలగలిపి చేస్తున్నారు. ఓ వైపు పథకాలతో అన్ని వర్గాల్లోనూ… సంతృప్తి నింపేందుకు ప్రయత్నిస్తూ.. మరో వైపు.. పారిశ్రామికీకరణ ఎలా జరిగిందో.. ప్రత్యక్షంగా చూపించేందుకు కియా కార్ల ఉత్పత్తి లాంటి ఈవెంట్‌ను హైలెట్‌గా చేస్తున్నారు. మరో వైపు.. ప్రజల్లో భావోద్వేగ పరంగా ఉన్న ప్రత్యేకహోదా సెంటిమెంట్‌ను రగిలించేందుకు .. మాస్టర్ ప్లాన్ వేశారు. దాని ప్రకారం… అఖిలపక్ష భేటీ దగ్గర్నుంచి.. ఢిల్లీ దీక్షల వరకూ.. చాలా ప్లాన్ చేశారు.
ముందుగా విభజన సమస్యలు, కేంద్రం మోసంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎన్నికలకు ముందు ఢిల్లీ సర్కార్ పై ఓ రేంజ్ యుద్ధం చేయాలనుకుటున్న చంద్రబాబు.. ఇందు కోసం అందర్నీ కలుపుకుని వెళ్లాలనుకుంటున్నారు. అందులో భాగంగానే మరోసారి అఖిలపక్ష సమావేశం పెట్టారు. పార్లమెంట్ సమావేశాలకు మించిన.. అవకాశం మళ్లీ దొరకదు కాబట్టి.. దాన్నే చంద్రబాబు… తన పోరాటానికి వేదికగా చేసుకున్నారు. తన పోరాటంపై.. అన్ని పక్షాల అభిప్రాయం తెలుసుని.. వారిని కూడా.. తనతో పాటు ఢిల్లీ తీసుకెళ్లే అవకాశం ఉంది. పార్లమెంట్ సమావేశాల చివరి రోజున.. చంద్రబాబు ఎలాగూ దీక్ష చేయాలనుకుంటున్నారు కాబట్టి.. అందర్నీ కలుపుకుని.. ఆ దీక్ష చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు దీక్షకు అందరు జాతీయ నేతలు మద్దతు తెలుపుతారు.. సహజంగానే ఇది దేశం దృష్టిని ఆకర్షిస్తుంది.
అఖిలపక్షల భేటీకి వైసీపీ తప్ప అన్ని పార్టీలు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉండవల్లి ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీకి కూడా… వైసీపీ రాలేమని చెప్పింది. ఇక ప్రభుత్వం నిర్వహించే సమావేశానికి వచ్చే అవకాశం లేదు. అదే సమయంలో పవన్ కల్యాణ్ కానీ.. ఆయన పార్టీ తరపున ఇతరులు కానీ హాజరయ్యే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో.. అఖిలపక్షం పెట్టాలని పవన్ కల్యాణే స్వయంగా పలుమార్లు డిమాండ్ చేశారు. గుంటూరు శంఖారావం సభలోనూ… పవన్ కల్యాణ్… కలసి పోరాడాలని అందరికీ పిలుపునిచ్చారు. విభజన సమస్యల కోసం కలసి పోరాడదాం.. ఎవరికి వారు పోటీ చేద్దాం అనే ఫార్ములా చెప్పారు. ఆ ప్రకారం అఖిలపక్ష సమావేశానికి జనసేన హాజరవడం ఖాయమే. ఇలా చేయడం వల్ల పోరాటానికి నేతృత్వం వహించిన క్రెడిట్ టీడీపీ ఖాతాలో పడిపోతుంది. దీక్ష చేసిన చంద్రబాబుకు.. మైలేజ్ వస్తుంది. ఎలా చూసినా.. హోదా సెంటిమెంట్‌ను మరోసారి రగిలించి.. తన వంతు రాజకీయ లబ్దిని .. పొందడానికి చంద్రబాబు మాస్టర్ స్కెచ్ వేశారని అనుకోవచ్చు.