నిర్మాత దిల్ రాజు ఇప్పుడు ఫుల్ జోష్ లో వున్నారు. మళ్లీ చకచకా సినిమాలు చేసే ప్రయత్నంలో వున్నారు. చిన్న,మీడియం సినిమాలే సేఫ్. తేడావచ్చినా పెద్దగా లాస్ వుండదు. కొడితే కుంభస్థలం కొట్టినట్లే అని ఫిక్స్ అయిపోయారు. అందుకే చకచకా ప్రాజెక్టులు సెట్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో హీరో రాజ్ తరుణ్ తో ఓ ప్రాజెక్టు ఫైనల్ చేసారు. ఆ మధ్య ఓ సినిమా రాజ్ తరుణ్ తో చేసారు. కానీ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఆ సినిమా ఫంక్షన్లలో దిల్ రాజు మాటలకు రాజ్ తరుణ్ కాస్త ఫీలయ్యాడని వార్తలు కూడా వినవచ్చాయి. అయితే అవన్నీ అలా వుంచితే మళ్లీ అదే రాజ్ తరుణ్ తో దిల్ రాజు సినిమా చేయబోతున్నారు.
గతంలో సుధీర్ బాబుతో ఆడు మగాడ్రా బుజ్జీ అనే సినిమా చేసిన కృష్ణారెడ్డి అనే డైరక్టర్ కు దిల్ రాజు చాన్స్ ఇస్తున్నారు. అతను తయారుచేసిన మాంచి స్క్రిప్ట్ కు తుదిమెరుగులు దిద్దించే ప్రయత్నంలో వున్నారు. మొత్తానికి దిల్ రాజు వెనుకబడిన ఇద్దరికి చేయూత ఇస్తున్నారన్నమాట. మంచి పనే కదా?