ఎమ్మార్ ప్రాపర్టీస్ గురించి ప్రస్తావన వస్తే జగన్ అక్రమాస్తలు కేసులే గుర్తుకు వస్తాయి. జగన్, వైఎస్ క్విడ్ ప్రో కో సమాంతరంగా ఈ స్కాం జరిగింది. ఆ కేసులన్నీ ఇప్పుడు ఎమ్మార్ పై ఉన్నాయి. తమ ప్రాజెక్టుల వివాదాలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్థ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వాన్న ికోరారు. ఎమ్మార్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ అలబ్బర్ నేతృత్వంలో బృందం వచ్చింది. అధికారులతో చర్చించింది. తర్వాత అధికారులు సీఎంకు చర్ల్చల సారాంశం వివరించారు.
ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారాన్ని పరిష్కరించేందుకు 2015లో చీఫ్ సెక్రటరీ నాయకత్వంలో అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి అదనంగా న్యాయ నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. యూఏఈ ప్రభుత్వ ఆమోదంతో ఒక లీగల్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకుంటామని ఎమ్మార్ సంస్థ తెలిపింది. వారి ప్రతిపాదనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమోదించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ వారితో సంప్రదింపులు జరిపి తదుపరి సూచనలు, సలహాలు అందిస్తుందని చెప్పారు.
2001లో ఉమ్మడి రాష్ట్రంలో దుబాయ్‌కు చెందిన ఎమ్మార్ ప్రాపర్టీస్ హైదరాబాద్‌లో కన్వెన్షన్ సెంటర్, హోటల్, గోల్ఫ్ కోర్సు, విల్లాలు తదితర ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు అప్పటి ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంది. 2003లో గచ్చిబౌలిలో 535 ఎకరాల్లో బౌల్డర్ హిల్స్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం, ఎమార్ మధ్య ఒప్పందం జరిగింది. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీఐఐసీ వాటాను 26 శాతం నుంచి 4 శాతానికి తగ్గించింది. దాని ద్వారా ఐదు వేలక కోట్ల నష్టం వాటిల్లింది. కోనేరు ప్రసాద్ ఇందుకు ప్రతిఫలంగా జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. కోనేరు ప్రసాద్ ఇందులో కీలకం. ఇటీవల కోనేరుప్రసాద్ చనిపోయారు.
తమ ప్రాజెక్టులను వివాదాల నుంచి బయటకు లాగి ఉపయోగించుకునేందుకు ఎమ్మార్ ప్రాపర్టీస్ ప్రయత్నిస్తోంది. కానీ అవి అంత తేలికగా బయటకు వచ్చే అవకాశాలు లేవు.