జగన్ రెడ్డి నోరు తెరిస్తే.. మొదట వచ్చే మాట చంద్రబాబు.. మధ్యలో వచ్చే మాట చంద్రబాబు.. చివరిలో వచ్చే మాట చంద్రబాబు. అది ఏ ప్రోగ్రాం అయినా కానీ. ఎన్నికలు దగ్గరకు వస్తున్నందున జగన్ రెడ్డి శంకుస్థాపనలు.. పనికి రాని.. పని చేయని.. ఉపయోగం లేని సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమాలను చేస్తున్నరు. ఇలా నూజివీడులో ఓ ప్రోగ్రాం పె్టటారు. పేరు అసైన్డ్ భూములకు పట్టాలప్పగించడం. కానీ చేసిన ప్రసంగం మొత్తం చంద్రబాబు గురించే. చంద్రబాబు అదన్నా.. ఇదన్నారు. ఆయన దోపిడీ చేశారు.. ఆయనను నమ్ముతామా అని శోకండాలు పెటారు.
ఎక్కడ స్పీచ్ అయినా అదే స్క్రిప్ట్ .. అది ప్రభుత్వ కార్యక్రమం.. తాను ఏం చేశారో చెప్పుకోవచ్చు. కానీ ప్రతిపక్షాల్ని తిట్టడం.. వాళ్లకు ఓట్లేయవద్దని చెప్పడమే కాదు.. త్వరలో ఎన్నికలు వస్తాయి మాకే ఓటేయమని కోరడం కామన్. కనీసం కాస్త నైతిక విలువలు అనేవి ఏమైనా ఉంటే. ఇలాంటి ప్రసంగాలు చేయరు. కానీ జగన్ రెడ్డి వాటన్నింటికీ అతీతం. ఇప్పటికీ చంద్రబాబును అరెస్టు చేసి రెండు నెలల నుంచి లోకేష్ పాదయాత్ర.. చంద్రబాబు భవిష్యత్ గ్యారెంటీ యాత్రలను ఆపేశానని సంబర పడుతున్నారు. కానీ అంతకు మించి నగెటివిటీ వచ్చిదంని ఊహించుకోలేకపోతున్నారు. జగన్ రెడ్డి ప్రసంగాలు వింటే.. చంద్రబాబును చూసి ఆయన ఎంత భయపడుతున్నారో అర్థమవుతుందని వైసీపీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి.
అన్ని కేసులు పెట్టి.. ఒక్క దానికీ సాక్ష్యం చూపించలేక కిందామీదా పడుతున్న సీఐడీ కేసుల వ్యవహారంపైనా ఆయన మాట్లాడటంలేదు. తాము కేసులు పెట్టం కాబట్టి అంతా దోపిడీ అనుకుంటున్నారు. ఐదేళ్లుగా అధికారంలో ఉండి.. చంద్రబాబు పధ్నాలుగేళ్లు సీఎంగా చేసిన చంద్రబాబుపై ఏడవడం తప్ప.. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి జగన్ రెడ్డి వెళ్లిపోవడం ఆ పార్టీ నేతల్ని కూడా నిరాశ పరుస్తోంది.