ఏపీలో చంద్రబాబు భద్రతపై నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. పదే పదే సెక్యూరిటిని రివ్యూ చేస్తూ జాగ్రత్తలు చెబుతున్నారు. ఇటీవలే ఎన్ఎస్జీ కమెండోల సంఖ్యను రెండింతలు చేశారు. అయినప్పటికీ రాజకీయ పర్యటనల్లో వైసీపీ నేతలు ఏదో ఓ అలజడి రేపడానికి వెనుకాడటం లేదు. కృష్ణా జిల్లాలో పూలతో కలిసి రాయి విసిరిన అంశం సంచలనం సృష్టించింది. దీనిపై ఎన్ఎస్జీ కమెండోలు.. తమ ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లుగా తెలుస్తోంది.
ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కూడా.. ఎన్ఎస్జీ అధికారుల్ని విస్మయ పరుస్తోంది. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న నేతపై రాళ్లదాడి చేస్తే.. కనీసం కేసు పెట్టలేదు. టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తే.. ఏదో ఓ సాకు చెప్పారు. ఎవరుదాడి చేశారో.. సీసీ కెమెరా దృశ్యాలు ఫోటోలతో టీజీపీ నేతలు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇక టీడీపీ ఆఫీసుపైనే నేరుగా వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటన ఇప్పటికీ సంచలనంగానే ఉంది. అధికారం కోసం వైసీపీ నేతుల తమ ప్రత్యర్థుల్ని భౌతికంగా అంతమొందించడానికి కూడా వెనుకాడని నైజం ఉన్న వారని స్పష్టత రావడం… ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్లడంతో చంద్రబాబు భద్రతపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.
ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇటీవల జిల్లాల పర్యటనలు ప్రారంభించారు. దీంతో ఆయన వాహనాల భద్రతలను రివ్యూ చేశారు. వాహనంపై నుంచి నిలబడి ప్రసంగించేటప్పుడు… బుల్లెట్ ఫ్రూప్ గ్లాస్ లాంటిది ఉండాలని నిర్దేశించారు. అయితే సమయంలో ఎన్ఎస్జీ కమెండోలు కూడా మరితం జాగ్రత్తగా సెక్యూరిటీని పర్యవేక్షించనున్నారు.