పూర్తయిన ఎన్నో సినిమాలు విడుదలకు నోచుకోకుండా ఆగిపోతుంటాయి. సినిమా పబ్లిసిటీని కూడా ప్లాన్ చేసుకునే నిర్మాతలు సుమారు ఓ ఏడాదిపాటు విడుదల మీద ఆశతో టీవీల్లో ట్రైలర్లు వేయిస్తూ కిందా మీదా పడి విడుదలకు ప్రయత్నాలు చేస్తుంటారు. అంతకంటె ఎక్కువ కాలం ఒక సినిమా ఆగిపోయిందంటే గనుక.. ఇక అది ఎప్పటికీ విడుదల కాదనే బాధతో ప్రయత్నాల్ని కూడా ఆపేస్తారు. కానీ అలుపెరగకుండా ఎప్పటికైనా విడుదల చేసి తీరాలని ప్రయత్నించే సినిమాలు కొన్ని ఉంటాయి. ఆ కోవలోకే వస్తుంది రమ్యశ్రీ తాను హీరోయిన్ గా తన దర్శకత్వంలోనే రూపొందించిన చిత్రం ‘ఓమల్లి’!
‘ఓ మల్లి’ అనే టైటిల్ ఓ గిరిజన అమ్మాయి జీవితంలో ఎదురయ్యే రకారకాల అనుభవాలను తెలియజెప్పడమే ఈ సినిమా ఉద్దేశం. అదివరలో సినిమాల్లో వ్యాంప్ తరహా ఆంటీ పాత్రలకు, ఐటం పాత్రలకు మాత్రం పరిమితమైన రమ్యశ్రీ ఈ చిత్రంలో కథానాయిక పాత్రను పోషించింది. పైగా ఆమె దర్శకత్వం వహించడం విశేషం. అంతకంటె గొప్ప ట్విస్టు ఏంటంటే..
ఈ కథను తీసుకువెళ్లి.. తమిళ దిగ్దర్శకుడు బాలచందర్ కు వినిపించి.. ఆయనను దర్శకత్వం వహించాల్సిందిగా కోరిందిట. కథను అద్భుతంగా నెరేట్ చేశావ్ నువ్వే లాగించేయ్ అంటూ దీవించారట. ఆ స్ఫూర్తితో మెగాఫోన్ పట్టుకుంది. సినిమా అయితే పూర్తయింది కానీ.. విడుదలకు నోచుకోలేదు. ఇదివరలో కొన్ని సార్లు ట్రైలర్లు టీవీల వరకు వచ్చాయి. కానీ ఫలితం లేదు. తాజాగా మళ్లీ టీవీ ఛానళ్లలో ‘ఓమల్లి’ ట్రైలర్లు దర్శనమిస్తున్నాయి.
మార్కెటింగ్ ఎలిమెంట్ ఏంటంటే.. ఈ చిత్రంలో మల్లికి ‘రైక’ వేసుకోవడం తెలియదు. కేవలం చీర మాత్రమే ధరించి.. తన అందాలను యథేచ్ఛగా ప్రదర్శిస్తూ ఉంటుంది. అలాగే జలపాతాల్లో స్నానాలు చేస్తూ.. విచ్చలవిడిగా ప్రేక్షకులకు కనువిందు చేస్తుంది. ఇలా అనేక రకాలుగా తన అందాలను దాచకుండా ప్రేక్షకులను అలరించడానికి నానా కష్టాలు పడింది. అయినా దానిని ఆస్వాదించడానికి తెలుగు ప్రేక్షకులు సిద్ధం కావడం లేదు. సినిమా సుమారు మూడేళ్లుగా విడుదల కావడం లేదు. ఈ ట్రైలర్లు తాజాగా టీవీ ఛానళ్లలో మళ్లీ దర్శనం ఇస్తున్నాయంటే.. ఈసారైనా థియేటర్ యోగం ఉందో లేదో చూడాలి.