తెలుగు సినిమా హీరోలందరూ కూడా తెరపైన మాత్రం ధైర్యానికి, తెగువకు బ్రాండ్ అంబాసిడర్స్ అన్నట్టుగా ఉంటారు. ఎంత రిస్క్ అయినా, ఎలాంటి రిస్క్ అయినా ఫేస్ చేయడానికి రెడీగా ఉంటారు. కానీ తెర వెనుక మాత్రం దీనికి రివర్స్‌లో ఉంటుంది వ్యవహారం. ప్రతి దానికీ భయపడుతూ ఉంటారు. ఏం చేస్తే ఏమవుతుందో అన్న టెన్షన్‌తో ఉంటారు. ఈ విషయాన్ని స్వయంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి హీరో ఒప్పేసుకున్నాడు కూడా. గజిని సినిమా రీమేక్‌లో నటించమని పవన్‌ని అప్రోచ్ అయినప్పుడు అలాంటి భయాలతోనే ఆ ఆఫర్‌ని రిజెక్ట్ చేశాడట. పవన్ కంటే కూడా రామ్ చరణ్‌కి ఈ విషయంలో ఇంకా భయాలు ఎక్కువ.
అప్పుడెప్పుడో మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా తర్వాత చేసిన ‘ఆరెంజ్’ సినిమా ఫ్లాప్ అయిందని చెప్పి లవ్ స్టోరీస్, కొత్త కథలకు ఆమడ దూరం వెళ్ళిపోయాడు చరణ్. ఫెయిల్యూర్ భయం ఆ రేంజ్లో పట్టేసింది. రచ్చ లాంటి మూమూలు కథ, కొత్త డైరెక్టర్‌తో తీసిన సినిమా హిట్ ముద్ర వేయించుకోవడం కూడా చరణ్ ఆలోచనల్లో మార్పుకు కారణమైంది. ఆ తర్వాత నుంచి ఓ రొటీన్ మాస్ కథ, బిల్డప్స్తో కూడిన సినిమాటిక్ హీరోయిజం, ఓ నాన్న పాట రీమేక్ అనే కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు చేసేశాడు. ప్రేక్షకులకు బోర్ కొట్టేవరకూ అదే ఫార్మాట్ ఫాలో అయ్యాడు. చివరకు స్వయానా నాన్న చిరంజీవినే ఫీల్డ్‌లోకి దించినా…ఈ రొటీన్ ‘బ్రూస్ లీ’ మాకొద్దని ఆడియన్స్ చెప్పేశారు.
‘బ్రూస్ లీ’ రిజల్ట్ ఎఫెక్ట్ రామ్ చరణ్ ఆలోచనల్లో భారీ మార్పులే తీసుకొచ్చినట్టుంది. ఇప్పుడు విలన్‌కే ఇంపార్టెన్స్ ఎక్కువ ఉన్న ‘థనీ ఒరువన్’ సినిమాను రీమేక్ చేస్తున్నాడు. ఆ తర్వాత కూడా సుకుమార్ లాంటి న్యూ జెనరేషన్ డైరెక్టర్‌తో ఓ సినిమా చే్స్తున్నాడు. అలాగే లవ్ స్టోరీస్ చేయడానికి అవసరమైన ఏజ్ కూడా ఇంకా తనకు ఉందని రామ్ చరణ్‌కి ఇన్ని రోజులకు తెలిసొచ్చినట్టుంది. అందుకే ఆరెంజ్ సినిమా తర్వాత కనీసం ప్రేమకథలు వినడానికి కూడా ఇష్టపడని చరణ్ ఇప్పుడు లవ్ స్టోరీస్ పైన ఫోకస్ చేస్తున్నాడట. ఒకటి రెండు హిట్స్ ఇచ్చిన యంగ్ డైరెక్టర్స్ చరణ్‌కి లవ్ స్టోరీస్ వినిపించారట. ఫైనల్ డెసిషన్ ఏంటనేది తెలియదుకానీ ఎంత సేపూ మాస్…ఊరమాస్ అంటూ సినిమాలు చేసుకుపోయిన చరణ్ ఆలోచనల్లో మార్పు రావడం మాత్రం చరణ్ కెరీర్‌కి హెల్ప్ అయ్యే విషయమే. అలాగే ఇండస్ట్రీ హిట్ కొట్టిన హీరో అయితే అవ్వొచ్చు కానీ యాక్టింగ్ విషయంలో కూడా రామ్ చరణ్ మెచ్యూర్ అవ్వాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అల్లు అర్జున్‌లాగే అక్కడ కూడా హార్డ్ వర్క్ చేశాడంటే అప్పుడు మెగాస్టార్‌కి అసలైన వారసుడనిపించుకుంటాడు రామ్ చరణ్ తేజ్.