అజ్ఞాతవాసి టాక్ ఎలాగున్నా…. ఇంత రిచ్ సినిమా ఈమధ్య కాలంలో చూళ్లేదన్నది జనాల మాట. అదీ నిజమే.. ప్రతీ ఫ్రేమ్ చాలా రిచ్‌గా కనిపించింది. చిన్న చిన్న పాత్రలకు కూడా పేరున్న నటుల్ని తీసుకున్నారు. వాళ్ల రెమ్యునరేషన్లు కూడా భారీగా ఉన్నాయి. ఒక్క రావు రమేష్‌కే కోటి రూపాయలు అందాయట. నిజానికి ఆయనది రోజువారీ పారితోషికం. ఒక్క రోజుకి కనీసం 3 నుంచి 4 లక్షల రూపాయల వరకూ ఉంటుంది. ఈ సినిమాకోసం మహా అయితే పది రోజుల కాల్షీట్లు చాలు. కానీ అజ్ఞాతవాసి సెట్లో ప్రతీ రోజూ ఆయన కనిపించాల్సిందేనని త్రివిక్రమ్ ఆర్డర్ వేశార్ట. అందుకే రావు రమేష్ సీన్ ఉన్నా, లేకున్నా.. ఆయన టంచన్‌గా సెట్‌కి వచ్చేసేవార్ట. అలా.. అలా… ఆయన పారితోషికం కోటికి తేలింది. మురళీ శర్మదీ దాదాపుగా అదే పరిస్థితి. తన సినీ కెరీర్లో ఇప్పటి వరకూ తీసుకోని పారితోషికం ఈసినిమా ద్వారా తీసుకున్నారని తెలుస్తోంది. వర్మ – శర్మల ఎపిసోడ్లపై త్రివిక్రమ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. అందుకే.. వాళ్లకు ఆ స్థాయిలో పారితోషికాలు ఇచ్చారు. కానీ… ఇప్పుడు అవే తుస్సుమంటున్నట్టు టాక్.