ఆంధ్రప్రదేశ్ కు వెళ్లి… జగన్ తో కేసీఆర్ చర్చలు జరపాలన్న అంశంపై.. ఏకాభిప్రాయానికి వచ్చారు జగన్, కేటీఆర్.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో… టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం జరిపిన చర్చల్లో.. ఈ అంశంపై మాత్రం క్లారిటీక వచ్చారు. ఫెడరల్ ఫ్రంట్ గురించి కేటీఆర్ వివరించారని… తనతో ఫోన్ లో కూడా మాట్లాడారని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. నేరుగా వచ్చి కలుస్తానని.. వివరంగా చర్చించుకుందామని కూడా… కేసీఆర్ చెప్పినట్లు.. సమావేశం తర్వాత జగన్మోహన్ రెడ్డి మీడియాకు తెలిపారు. అచ్చంగా కేటీఆర్ కూడా అదే చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ ఉద్దేశాల గురించి.. జగన్ తో చర్చించామని.. మిగతాది కేటీఆర్… ఆంధ్రకు వెళ్లి జగన్ తో కూలంకుషంగా చర్చిస్తారని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదాను తాము ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నట్లుగా.. కేటీఆర్ మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. మూడేళ్ల కిందట తమ ఎంపీలు కేకే, కవిత సపోర్ట్ చేశారని.. ఏపీకి ప్రత్యేకహోదా తమకేమీ అభ్యంతరం కాదని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల ప్రచారంలో.. ప్రత్యేకహోదా ఇస్తే పరిశ్రమలు ఏపీకి తరలిపోతాయని.. కాంగ్రెస్ తెలంగాణకు అన్యాయం చేస్తోందని.. కేటీఆర్ దాదాపుగా ప్రతి బహిరంగసభలోనూ చెప్పారు. వాటిని ఆయన మర్చిపోయారు. కేసీఆర్ ఏపీకి వెళ్లి జగన్మోహన్ రెడ్డితో చర్చలు జరుపుతారని.. ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడతారని చెప్పుకొచ్చారు. ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఅర్ చేస్తున్నప్రయత్నాలు ప్రశంసనీ.మని జగన్మోహన్ రెడ్డి కూడా అభినందించారు. జగన్మోహన్ రెడ్డి.. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై చాలా సానుకూలంగా స్పందించారు. ఏపీకి ప్రత్యేకహోదా రావాలంటే.. కచ్చితంగా కేసీఆర్ సపోర్ట్ ఉండాల్సిందేనన్నట్లుగా మాట్లాడారు. రాష్ట్రానికి అన్యాయం జరగకుండా ఉండాలంటే సంఖ్యాబలం ఉండాలని ఏపీకి ఉన్న 25 సీట్లతో అది సాధ్యం కాదని చెప్పుకొచ్చారు.
25 మంది ఎంపీలతో.. ప్రత్యేకహోదా సాధిచంలేదం.. దాన్ని 42కి చేయాలి.. వీలైతే ఇంకా ఎక్కువ చేసుకోవాలని విశ్లేషించారు. రాష్ట్రాల హక్కుల కోసం.. కేసీఆర్ సమర్థంగా ప్రయత్నిస్తున్నారని… సర్టిఫికెట్ ఇచ్చేశారు. జగన్, కేటీఆర్ అంతర్గతంగా ఏమి చర్చించారో కానీ.. ఏపీ రాజకీయాల గురించిమాత్రం.. బయట ఒక్క మాట కూడా మాట్లాడలేదు. లోటస్ పాండ్కి కేటీఆర్ బృందం వచ్చినప్పుడు వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఇంత వరకూ.. లోటస్ పాండ్ లోపల ఎలా ఉంటుందో.. ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు. కానీ.. కేటీఆర్ బృందంతో జగన్ సమావేశం అయిన ఫోటోలు మాత్రం బయటకు వచ్చాయి. అధికారికంగా విడుదల చేశారు.