ప్రోడక్ట్ ఎంత బావున్నా ప్రమోషన్ లేకపోతే ఎవరికీ పట్టదు. సినిమాలకైతే ప్రమోషనే కీలకం. ‘బాహుబలి’ని ఇంకా ప్రమోట్ చేయాల్సిందని రాజమౌళి ఒక సందర్భంలో అభిప్రాయపడ్డారంటే ప్రమోషన్స్ కి వున్న ప్రాధన్యత అర్ధం చేసుకోవచ్చు.
ఇప్పుడు అందరూ ప్రమోషన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. రిలీజ్ డేట్ ని ముందే రివిల్ చేసి దాని తగ్గట్లు ప్రమోషన్స్ ని ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే అఖిల్ ఏజెంట్ ప్రమోషన్స్ ప్లాన్ మాత్రం అనుకున్నట్లు జరగలేదు. సినిమా చాలా సార్లు వాయిదా పడింది.షూటింగ్ ఆలస్యమౌతూ వచ్చింది. ఏప్రిల్ 28 అని ముందే ప్రకటించినా ప్రమోషన్స్ మొదలుపెట్టలేదు.
ఇప్పుడు రెండు వారాలు సమయం కూడా లేదు. ఇంత తక్కువ సమయంలో బజ్ క్రియేట్ కావాలంటే ఏదో క్రేజీగా చేయాలి. ఇప్పుడు అదే పనిలో వుంది ఏజెంట్ టీం. ఇందులో భాగంగా అఖిల్ ఓ క్రేజీ వైల్డ్ స్టంట్ చేశాడు. 150 అడుగుల ఎత్తు నుంచి రోప్ సహాయంతో డైవ్ చేశాడు. ఈ ఫీట్ విజయవాడలో జరిగింది. ఇదొక అరుదైన స్టంట్ అనే చెప్పాలి. ఇలాంటి ఫీట్లు ఇంతముందు ఎవరూ చేసినట్లు లేదు. ఈవెంట్లలో రోప్ సాయంతో స్టేజ్ పైకి దిగుతారు కానీ ఇలా ఒక షాపింగ్ మాల్ పై నుంచి కిందకు జంప్ చేసే ఫీట్ అఖిలే చేశాడు. సమయం తక్కువ వుంది. ఇలాంటి వైల్డ్ ఫీట్లతో చేస్తేనే ప్రేక్షకుల ద్రుష్టి పాడుతుందని అనుకున్నారమో కానీ అఖిల్ పెద్ద సాహసమే చేశాడు.