పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న అఙ్ఞాతవాసి (టైటిల్ అఫీషియల్ గా కన్ ఫర్మ్ కాలేదు) మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది.
కీర్తీ సురేష్, అనూ ఇమాన్యుయేల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కోసం అనిరుద్ పాడిన సాంగ్ ను విడుదల చేశారు. దానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక మొత్తం అన్ని సాంగ్స్ ను డిసెంబర్ 14 వ తేదిన రిలీజ్ చేయనుంది చిత్ర నిర్మాణ సంస్థ హారికా, హాసిని క్రియేషన్స్. మూవీ జనవరి 10వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది.