అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఇచ్చిన ‘చలో విజయవాడ’పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కడిక్కకడ అరెస్ట్ చేశారు. అయితే ఇదే జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ నేతల్ని ముందు పెట్టి అగ్రిగోల్డ్ ఉద్యమం నడిపించారు. అప్పిరెడ్డి, పప్పిరెడ్డిల్ని ముందు పెట్టి నిరసనలు చేశారు. అప్పుడు ప్రభుత్వం అడ్డుకోలేదు అది వేరే విషయం. ప్రభుత్వం ఇవ్వదు కానీ .. తాము రాగానే డబ్బులు ఇచ్చేస్తామని మభ్య పెట్టారు. చివరికి నెత్తిన టోపీ పెట్టారు.
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే బడ్జెట్లో రూ. 1150 కోట్లు ఇస్తామని సీఎం జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలనూ పెట్టారు. కానీ రూపాయి కూడా విడుదల చేయలేదు. తర్వాత బడ్దెట్‌లో రూ. 200 కోట్లు కేటాయించారు . కానీ ఖర్చు చేయలేదు. ఆ తర్వాత అగ్రిగోల్డ్ బాధితులకు ఎలాంటి కేటాయింపులు లేవు. మంజూరు లేదు. అగ్రిగోల్డ్ సంస్థ 2015 జనవరిలో బోర్డు తిప్పేయడంతో డిపాజిట్‌దారులు, ఏజెంట్లు గుండెపోటుతో ఇప్పటి వరకు 300 మందిపైనే మృతి చెందారు. వారిలో 144 మందికి గత ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించింది. తాము వస్తే రూ. పది లక్షలు చెల్లిస్తామని జగన్ హామీ ఇచ్చారు. కానీ నేటి వరకు ఒక్క పైసా ఇవ్వలేదు. ఇలా చావులతోనూ ప్రయోజనం పొందారు.
అగ్రిగోల్డ్‌లో రాష్ట్రానికి చెందిన 19.52 లక్షల మంది డిపాజిట్లు, పెట్టుబడులు పెట్టగా, దేశంలోని ఏడు రాష్ట్రాలలో 32 లక్షల మంది బాధితులు ఉన్నారు. రాష్ట్రానికి చెందిన బాధితులకు న్యాయం చేస్తామని గత టిడిపి ప్రభుత్వం, ప్రస్తుత వైసిపి సర్కార్ ఇచ్చిన హామీలు నెరవేరలేదు. అయినప్పటికీ బాధితులు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. బాధితులకు రూ.3,964 కోట్లను చెల్లించాలని సిఐడి తేల్చింది. ఆస్తుల్ని అమ్మేసి న్యాయం చేద్దామని చూస్తే… అడ్డగోలు ఆరోపణలు చేసి.. కోర్టులకు వెళ్లి ఆపేశారు. ఇప్పుడు తాము వచ్చాక నిండా ముంచేశారు. ఇప్పుడు ఈడీ వేలం వేసిన కొన్ని ఆస్తులను కూడా అటాచ్ చేసింది. దీంతో ఇక ఎప్పటికీ సమస్య పరిష్కారం కాదని తేలిపోయింది.
జగన్ రెడ్డిని నమ్మి బాధితులకు న్యాయం చేసేందుకు ప్రయత్నం చేసిన ప్రభుత్వాన్ని నిందించారు. దూరం చేసుకున్నారు. ఇప్పుడు మొత్తం గోచీ ఊడదీశాడు జగన్ రెడ్డి.