తమిళ నాట రాజకీయాలు కలగాపులగంగా మారుతున్నాయి. అన్నాడీఎంకే ఎవరితో పొత్తు పెట్టుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. విజయ్‌తో అన్నాడీఎంకేను కలపాలని ప్రశాంత్ కిషోర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన స్వయంగా చర్చలు జరిపారని అంటున్నారు. అయితే ఆయన అన్నాడీఎంకేకు చీఫ్ మినిస్టర్ పోర్టు.. విజయ్ కు డిప్యూటీ పోస్ట్ అని సమీకరణాలు రెడీ చేసినట్లుగా ప్రచారం జరగడంతో కలకలం రేగింది. అయితే హఠాత్తుగా అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయాల్సిందేనని ఆయన అన్నాడీఎంకే చీఫ్ కు గట్టిగానే సందేశం ఇచ్చినట్లుగా చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఎన్డీఏలో భాగంగానే కలిసి పోటీ చేశారు. తర్వాత బీజేపీకి దూరమయ్యారు. అయితే ఇప్పుడు మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కలసి పోటీ చేద్దామని బీజేపీ నుంచి సందేశాలు రావడంతో నళిని స్వామి రెడీ అయ్యారు. విజయ్ తో పొత్తులే అన్నాడీఎంకేకు బెటర్ కానీ.. బీజేపీ నుంచి వచ్చేవి తిరస్కరించలేని ఆఫర్లు. అందుకే తప్పదు.
అన్నాడీఎంకేను బీజేపీ దూరం చేస్తున్న విషయాన్ని అర్థం చేసుకున్న విజయ్.. బీజేపీపై విమర్శలు ప్రారంభించారు. జమిలీ ఎన్నికలు పెట్టి ఆ పార్టీ తమిళనాడులో అధికారాన్ని పొందాలనుకుంటోందని అంటున్నారు. అన్నాడీఎంకేకు బలమైన, స్థిరమైన ఓటు బ్యాంక్ ఉంది. ఇది డీఎంకేకు వ్యతిరేకంగా ఉంటుంది. ఆ ఓట్లు చీలితే డీఎంకేకు విజయం దక్కుతుంది. అందుకే విజయ్, అన్నాడీఎంకేను కలపాలని పీకే అనుకున్నారు. కానీ బీజేపీ ఇప్పుడు తమిళ్ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అందుకే మార్పులొస్తున్నాయి.