అమరావతికి రుణం ఇచ్చేందుకు మరో అంతర్జాతీయ రుణ సంస్థ వెనక్కి తగ్గింది. అమరావతి సస్టెయినబుల్ ప్రాజెక్టుకు రెండు వందల మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు గతంలో ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ .. ఏఐబీబీ ముందుకు వచ్చింది. ప్రభుత్వం కూడా.. అన్ని రకాల ప్రతిపాదనలను బ్యాంక్ ముందు ఉంచింది. రుణంతో.. తాము చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల ప్రజెంటేషన్ ఇచ్చింది. ఇక.. ఏఐబీబీ రుణం రావడం లాంచనమే అనుకుంటున్న సమయంలో.. అనూహ్యంగా పరిస్థితులు మారిపోయాయి. కేంద్ర ప్రభుత్వం రుణ ప్రతిపాదనను విరమించుకున్న కారణంగా… ప్రపంచబ్యాంక్ అమరావతికి రుణం ఇవ్వడానికి నిరాకరిచింది. ఈ ఎఫెక్ట్ ఏఐబీబీపై కూడా పడింది.
ప్రపంచబ్యాంకే వెనుకడుగు వేసిన తర్వాత… ఆ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లాలనుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే ఆసక్తి లేనప్పుడు.. తాము రుణం ఇచ్చి ప్రయోజనం లేదని… ఏఐబీబీ డైరక్టర్ల బృందం భావించినట్లుగా తెలుస్తోంది. ప్రపంచబ్యాంక్ రుణ ప్రతిపాదనల నుంచి డ్రాప్ అయినప్పుడే.. ఏఐబీబీ కూడా..రుణం మంజూరు చేయకపోవచ్చన్న ప్రచారం జరిగింది. చివరికి అదే నిజమయింది. నిజానికి అమరావతి ప్రాజెక్ట్ కు.. రుణ సాయం అందించడానికి అంతర్జాతీయ సంస్థలు ముందుకు వచ్చాయి. ఉజ్వలమైన భవిష్యత్.. అద్భుతమైన ఆదాయవనరుగా.. అమరావతి రూపొందే అవకాశం ఉందని… ప్రపంచ మార్కెట్ వర్గాలన్నీ అంచనా వేశాయి.
అందుకే స్టాక్ మార్కెట్లో.. లిస్టింగ్ కు వెళ్లినప్పుడు.. ఓవర్ సబ్ స్క్రైబ్ అయింది. కానీ.. ప్రభుత్వం మారిన తర్వాత.. అమరావతి రాత మారిపోయింది. అప్పటి వరకూ….నమ్మకంగా పనులు చేసిన కాంట్రాక్టర్లు కూడా ప్రభుత్వం మారగానే..పెట్టేబేడా సర్దుకుని వెళ్లిపోయారు. ఉన్న వారికి కూడా.. ఏపీ సర్కార్ కనీస నమ్మకం కలిగించలేకపోయింది. ఫలితంగా ఏపీకి ఆర్థిక వనరుగా మారుతుందనుకున్న అమరావతి.. అటకెక్కినట్లయింది.