రాజకీయ పార్టీలన్నీ మేనిఫెస్టోలు ప్రకటిస్తాయి.. ప్రజలకు ఏమి చేస్తామో హామీలిస్తాయి. కానీ దేశంలో ఒకే ఒక్క పార్టీ మాత్రం ఎలాంటి మేనిఫెస్టో ప్రకటించదు. అంతే కాదు. అదే విషయాన్ని ఎన్నికలసంఘానికి చెబుతుంది కూడా. అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోను ప్రతీ సారి ఎన్నికల సంఘానికి సబ్మిట్ చేయాలి. తమకు ఎలాంటి మేనిఫెస్టో లేదని లేఖను మజ్లిస్ సబ్మిట్ చేస్తుంది. మేనిఫెస్టో లేకపోవడమే తమ మేనిఫెస్టో అని మజ్లిస్ చెబుతుంది.
మజ్లిస్ కు రాష్ట్రంలో కేంద్రంలో అధికారం దక్కదు. ఆ విషయం ఆ పార్టీ నేతలకు తెలుసు. అందుకే మేనిఫెస్టో ప్రకటించరు. కానీ ఆ పార్టీ ప్రజాప్రతినిధులంతా ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ప్రజల మధ్యలో ఎంఐఎం పార్టీ. కౌన్సిలర్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటారని.. అదే తమ మేనిఫెస్టో అని మజ్లిస్ చీఫ్ చెబుతున్నారు. ఈ విషయంలో మజ్లిస్ ప్రజల అభిమానాన్ని పొందిందని అనుకోవచ్చు. దారుస్సలాంకు సాయం కోసం ఎవరు వెళ్లినా మాటలు వినేవాళ్లు ఉంటారు. ఆటోలకు చలానాలు రాస్తే … వస్తారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని కేసులు పెట్టినా వస్తారు. కరెంట్ బిల్లులు కట్టకపోతే కరెంట్ కనెక్షన్ పీకేసినా వస్తారు. వారు పౌరుల్ని అలా చూసుకుంటారు. ఇదే ప్రజాసేవ.
మజ్లిస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించినా ప్రకటించకపోయినా పాతబస్తీలో ఉన్న ఆరేడు సీట్లలో ఆపార్టీ నాయకులు భారీ మెజార్టీతో గెలుస్తారు. పాతబస్తీలో మజ్లిస్ క పోటీగా మరో పార్టీ లేదు గతంలో ఎంబీటీ ఉండేది. కానీ ఆ పార్టీ నేత అమానుల్లా ఖాన్ చనిపోయిన తర్వాత.. మజ్లిస్ పూర్తిగా పట్టు సాధించింది. అధికారంలో ఉండే పార్టీతో సన్నిహితంగా ఉంటూ..పాతబస్తీలోకి ఎవరూ ఎంటర్ కాకుండా.. తమ రాజకీయం తాము చేస్తూ ఉంటుంది. అందుకే ఆ పార్టీ సీట్లకు ఢోకా ఉండటం లేదు.