కేరళలోని కోజికోడ్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ సమయంలో..విమానం స్కిడ్ అయి రెండు ముక్కలు అయింది. ఓ ముక్క చాలా దూరంగా పడిపోయింది. మరో ముక్క రన్ వే పై ఉండిపోయింది. దుబాయ్ నుంచి ప్రయాణికుల్ని తీసుకుని కోజికోడ్ వస్తోంది ఎయిరిండియా విమానం. ఈ విమానంలో 191 మంది ప్రయాణికులు ఉన్నారు. పైలట్‌తో పాటు ఇద్దరు ప్రయాణికులు చనిపోయినట్లుగా చెబుతున్నారు. కొంత మందికి గాయాలయ్యాయి. ముందు జాగ్రత్తగా పెద్ద ఎత్తున అంబులెన్స్‌లను తరలించారు. పలువుర్ని సమీప ఆస్పత్రులకు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.
కేరళలో ప్రస్తుతం భారీ వర్షాలు పడుతున్నాయి. కోజికోడ్ ఎయిర్ పోర్టులోనూ… భారీ వర్షం పడింది. రన్ పై నీరు నిలిచి ఉండటంతో… ల్యాండింగ్ సమయంలో… స్కిడ్ అయినట్లుగా అనుమానిస్తున్నారు. విమానం రెండు ముక్కలైనప్పటికీ.. సున్నితమైన … ఇంధనం ఉండే ప్రాంతాల్లో ఎలాంటి డ్యామేజ్ జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మామూలుగా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మంటలు చెలరేగుతూ ఉంటాయి. ఓ వైపు వర్షం పడుతూండటం… విమానం… మధ్యకు విరగడంతో… ముప్పు తప్పింది.
విమానాలు ఐదు నెలల పాటు ఖాళీగా ఉన్నాయి. అలాగే పైలట్లు కూడా…రోజువారీ విధులకు దూరంగా ఉన్నారు. రన్ వేల నిర్వహణ కూడా అంతంతమాత్రంగానే ఉంది. అలాగే ఎయిరిండియా విమానం.. చాలా పాతదని చెబుతున్నారు. వందే భారత్ మిషన్ లో భాగంగా… ఎయిరిండియా విదేశాల్లో ఉన్న భారతీయుల్ని తీసుకు వస్తోంది. ఇలా స్వదేశానికి వస్తున్న కేరళీయులు… ప్రమాదం బారిన పడ్డారు. ఈ ప్రమాదానికి కారణం ఏమిటన్నది ఇంకా క్లారిటీ లేదు కానీ..ప్రాణనష్టం భారీగా లేకుండా ముందు జాగ్రత్తలను తీసుకున్నారు.