అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ లకు కరోనా సోకడం, ప్రస్తుతం ముంబైలోని నానావతీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడం తెలిసిన విషయాలే. ఇప్పుడు ఐశ్వర్యరాయ్‌కి కూడా కరోనా సోకింది. కూతురు ఆరాధ్యకి కూడా కరోనా పాజిటీవ్ గా నిర్దారణ అయ్యింది. అమితాబ్, అభిషేక్‌లకు కరోనా సోకడంతో.. ఇంట్లో వాళ్లకు కూడా కరోనా పరీక్షలు చేయించారు. జయా బచ్చన్‌కి నెగిటీవ్ గా తేలింది. మిగిలిన వాళ్ల పరీక్షా ఫలితాలు రావాల్సివుంది. ప్రస్తుతం ఐశ్వర్యని సైతం నానా వతీ ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
* రేఖ సైతం..
ప్రముఖ బాలీవుడ్ నటి రేఖకి సైతం కరోనా సోకిందని ప్రచారం జరుగుతోంది. రేఖ ఇంట్లో పనిచేసే సెక్యురిటీ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే.. వాళ్లలో కొంతమందికి పాజిటీవ్ గా తేలింది. దాంతో రేఖకి సైతం.. కరోనా టెస్టులు చేయించారు. దాంట్లో పాజిటీవ్ అని తేలిందని సమాచారం. అయితే పూర్తి వివరాలు అందాల్సివుంది.