‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాలతో ఫామ్లోకి వచ్చాడు సాయిధరమ్ తేజ్. ఇప్పుడు మరో సినిమాని పట్టాలెక్కించాడు. రోహిత్ కేపీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పట్టాలెక్కింది. ఈ చిత్రంలో హీరోయిన్గా ఐశ్వర్య లక్ష్మిని ఎంచుకొన్నట్టు తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో షూటింగ్ జరుగుతోంది. అక్కడ ఓ పల్లెటూరి సెట్ ని రూపొందించారు. సింహభాగం షూటింగ్ అక్కడే జరగబోతోంది. తేజ్, ఐశ్వర్య లక్ష్మి ఇతర ప్రధాన తారాగణంపై కొన్ని కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రం కోసం ‘సంబరాల ఏటి గట్టు’ అనే వెరైటీ టైటిల్ పరిశీలనలో ఉంది. దాన్నే ఫిక్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వాతంత్ర్యకాలం నాటి కథ ఇది. 1947 ప్రాంతంలో ఓ ఊర్లో ఏం జరిగింది? అనే ఇతి వృత్తంతో ఈ సినిమా నడుస్తుంది. సాంకేతికంగా ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారు నిర్మాతలు. ‘విరూపాక్ష’ కమర్షియల్ గా పెద్ద హిట్ కొట్టింది. దాంతో.. ‘సంబరాల ఏటి గట్టు’ బడ్జెట్ వెసులుబాటు దక్కింది. నిర్మాతలు కూడా భారీగా ఖర్చు పెట్టబోతున్నట్టు టాక్. కన్నడ, మలయాళ చిత్రసీమల నుంచి కొంతమంది ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో కనిపించబోతున్నారని టాక్.