చిరంజీవి ప్రస్తుతం ఉన్నారు. 80వ దశకంలో ఓ వెలుగు వెలిగిన దక్షిణాది తారలంతా ప్రతీ యేటా గెట్ టు గెదర్ ఏర్పాటు చేసుకొంటారు. రెండ్రోజుల పాటు విందు – వినోదాలతో పండగ చేసుకొంటారు. ఈసారి ఆ వేడుక చైనాలో జరుగుతోంది. అందుకోసం చిరు చైనా విమానం ఎక్కేశాడు. చిరు తిరిగిరావడానికి మరో వారం రోజులైనా పడుతుంది. ఈలోగా.. ఇక్కడ చిరు 151వ సినిమా కోసం ముమ్మర ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. చిరు జన్మదినం సందర్భంగా ఆగస్టు 22న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించి, సెప్టెంబరులో రెగ్యులర్ షూటింగ్ మొదలెడతారు. కథానాయికగా చాలామంది పేర్లు పరిశీలనలో ఉన్నా.. చివరికి ఐశ్వర్యరాయ్ పేరే ఖరారయ్యే అవకాశాలున్నాయి.
ఈ ప్రాజెక్టులో పాలు పంచుకోవడానికి ఐష్ ఓకే అనేసిందని టాక్. అయితే.. పారితోషికంగా రూ.6 కోట్లు డిమాండ్ చేసిందట. కాల్షీట్లు కూడా పరిమితంగానే ఆఫర్ చేసిందని, ఈ డీల్ చరణ్ అండ్ టీమ్కీ నచ్చిందని తెలుస్తోంది. దక్షిణాదిన ఎన్నో హిట్ చిత్రాలకు కెమెరామెన్‌గా వ్యవహరించిన రవి వర్మ ఈ సినిమాకి ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహించనున్నారు. సంగీత దర్శకులుగా బాలీవుడ్ దిగ్గజాల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇవన్నీ జులై చివరి వారంలోగా డిసైడ్ అయిపోతాయి.